రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ `ఆర్ ఆర్ ఆర్`. దేశ వ్యాప్తంగా ఈ చిత్రంపై చర్చ జరుగుతోంది. ఇద్దు లెజెండ్‌ల ఫిక్షనల్ స్టోరీని ఈ మూవీ ద్వారా రాజమౌళి తెరపైకి తీసుకురాబోతున్నారు. ఒకరు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు.. మరొకరు నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని విల్లుతో పాటు బందూక్ పట్టిన గోండు బెబ్బులి కొమరంభీం. ఈ ఇద్దరి పాత్రల్లో రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నారు.
రామ్‌చరణ్ పుట్టిన రోజున రామరాజు పాత్రని భీం వాయిస్‌లో పరిచయం చేసిన రాజమౌళి ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం పాత్రని ఆయన జన్నదినం సందర్భంగా ఈ నెల 22న రామరాజు ఫర్ భీం పేరుతో టీజర్‌ని రిలీజ్ చేశారు. హాలీవుడ్ స్థాయి విజువల్స్, ఎన్టీఆర్ రోరింగ్ పెర్ఫార్మెన్స్ తో టీజర్ అదరగొట్టేసింది. అయితే చివర్లో ఎన్టీఆర్ ముస్లీమ్ క్యాప్ ధరించి కనిపించడం వివాదానకి దారితీసింది.
దీనిపై బీజేపీ ఎంపీ సోయం బాబూరావు తీవ్ర స్థాయిలో `ఆర్ ఆర్ ఆర్` టీమ్‌తో పాటు దర్శకుడు రాజమౌళిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ సన్నివేశాల్ని తొలగించకుంటే థియేర్లని కూలుస్తామని హెచ్చరించారు. ఆదివాసీలు కూడా హెచ్చరికాలు జారీ చేశారు. `బాహుబలి` సమయంలోనూ ఇదే తరహా హెచ్చరికలు రుచి చూసిన రాజమౌళి తాజా హెచ్చరికల నేపథ్యంలో నోరు విప్పడం లేదు. కనీసం ఆ సన్నివేశానికి సంబంధించి వివరించే ప్రయత్నం కూడా చేయకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.