రాజమౌళి ఇక భవిష్యత్ లో తెలుగుసినిమా తీసే అవకాశం లేదా..!!

-

బాహుబలి1,2′ సినిమాల తీసి రాజ మౌళి ప్రభాస్ కు భారీ క్రేజ్ తెచ్చి పెట్టి  పాన్ ఇండియా స్టార్  చేసాడు.ఇక రాజమౌళి కూడా ఇండియాలో టాప్  డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక దాని తర్వాత ఆర్ ఆర్ ఆర్ మూవీ తో మళ్లీ తన స్టామినా నిరూపించుకున్నాడు. ఇక తన దరిదాపులలోకి ఏ దర్శకుడు వచ్చే పరిస్థితి కనపడటం లేదు. తన టేకింగ్ తో అందరిని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇక తన సినిమా ఆర్ ఆర్ ఆర్ సినిమా నెట్ ప్లిక్స్ వల్ల హాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యి అక్కడ కూడా సంచలనం సృష్టించింది.

దానితో  ఈ సినిమా కోసం ఇప్పుడు కూడా కష్టపడుతున్నారు. దానికి హాలీవుడ్ లో ఎక్కువ రీచ్ అయ్యేలా చేస్తున్నాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన హాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడారు. మార్వెల్ స్టూడియోస్ ప్రెసిడెంట్ ‘కెవిన్ ఫీజ్’ నుంచి ఒక మర్వెల్ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం రాజమౌళికి వచ్చిందనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ విషయంపై స్పందించిన రాజమౌళి… “హాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వస్తున్నాయి కానీ తెలుగులో సూపర్ స్టార్ అయిన మహేశ్ బాబుతో ఒక సినిమా చేయాలి.ఆ తర్వాత తప్పకుండా ఓ హాలీవుడ్ సినిమా చేస్తా. కానీ అంతకంటే ముందు కొన్ని హాలీవుడ్ సినిమాల్ని స్టడీ చేయాలనుకుంటున్నా. వాళ్ల శైలి తెలుసుకోవాలి. మేకింగ్ పరంగా వాళ్లు ఎలాంటి టెక్నిక్స్ వాడుతున్నారు  వంటి విషయాలపై పూర్తిగా నాలెడ్జ్ ఉండాలి. అలాగే  మన మేకింగ్ విధానానికి… ఇంగ్లీష్ సినిమాల మేకింగ్ కి చాలా తేడా ఉంటుంది.దాన్ని పట్టుకోవాలి అని అన్నారు. ఎలాగూ మన సూపర్ స్టార్ మహేష్ కూడా హాలీవుడ్ హీరో లాగే ఉంటాడు కాబట్టి తనని బెట్టి హాలీవుడ్ సినిమా తీయాలని ఆయన ప్యాన్స్ కోరుకుంటున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news