మహేష్ సినిమాపై మరొకసారి క్లారిటీ ఇచ్చిన రాజమౌళి..!

-

ప్రస్తుతం మహేష్ బాబు , త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నారు. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ప్రపంచమంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తోంది. అలాగే ఈ సినిమా గ్లోబల్ అడ్వెంచర్ రేంజ్ లో ఉండనుందని రాజమౌళి చెప్పడంతో అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం #ఎస్ఎస్ఎంబీ 29 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు నెలకొనడం గమనార్హం.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి సూపర్ స్టార్ అభిమానులు కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరొకసారి మహేష్ బాబు అభిమానులకు మంచి కిక్ ఇచ్చే అప్డేట్ ఇచ్చాడు రాజమౌళి. ఈ సినిమా గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను ఆయన బయటపెట్టారు. రాజమౌళి మాట్లాడుతూ.. ” నేను దర్శకత్వం ఊహించిన అన్ని చిత్రాలలో చాలావరకు మా నాన్నే రచయిత. ఇక ఇప్పుడు మహేష్ సినిమాకి కూడా ఆయనే రచయిత. కొన్ని నెలల క్రితమే కథ రాయడం మొదలుపెట్టారు. ఆయన , నేను డెవలప్మెంట్ పనుల్లో బిజీగా ఉన్నాము . ఇదొక అడ్వెంచర్ కథ.. చాలా కాలంగా ఈ జోనల్లో సినిమా చేయాలని ఉంది. “ఇండియానా జోన్స్” నాకు ఇష్టమైన సినిమా” అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు.

ఇక ఈ సినిమాపై రాజమౌళి ఈ రకంగా చెప్పడంతో అభిమానులు పూర్తిస్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈగర్లీ ఈ సినిమా కోసం వెయిటింగ్ అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి రాజమౌళి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో? ఎలాంటి కథను ప్రేక్షకులకు అందించబోతున్నారో? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఏది ఏమైనా ఈ సినిమాతో మహేష్ బాబు పక్క బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటాడని చెప్పడంలో సందేహం లేదు అని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news