RRR : ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాజమౌళి .!

-

 ఏ ముహర్తాన రాజమౌళి RRR స్టార్ట్ చేశాడో కాని ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనాలకు  లోటు లేదు. సర్ప్రైజ్ ప్యాక్ లాగా  రాజమౌళి ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇక రీసెంట్ గా లాస్ ఏంజెల్స్ లో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ లో  బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘నాటు నాటు’ సాంగ్ కు గానూ ఆర్ ఆర్ ఆర్ మూవీ  గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ సాధించింన  సంగతి అందరికీ తెలిసిందే. దీనితో దేశం మొత్తం ఆర్ ఆర్ ఆర్ మూవీ మేనియా తో ఊగిపోయింది.

ఇప్పుడు నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు రేసులో షార్ట్ లిస్ట్ కు ఎంపిక అయ్యింది.దానితో అందరూ RRR టీమ్ కు అందరూ అభినందనలు తెలుపుతున్నారు. ప్రపంచంలో ప్రతిష్టాతకంగా భావించే ఆస్కార్ అవార్డుల్లో RRR అవార్డు తెస్తుందని భావిస్తున్నారు. దాని కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా సంగీత దర్శకుడు కీరవాణి కి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ను ప్రకటించింది.

దానితో ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న రాజమౌళి కొంచం గ్యాప్ ఇవ్వమ్మా అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఇప్పుడు RRR జపాన్ రికార్డ్స్ వంతు వచ్చింది. ఇప్పటికే వసూళ్ల లో జపాన్ లో ఆల్ టైమ్ హిట్ అయిన RRR ఇప్పుడు మరో  కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ సినిమ అక్కడ 100 రోజుల థియేట్రికల్ రన్ ని మొత్తం 114 కేంద్రాల్లో జరుపుకున్నట్టుగా అధికారిక ప్రకటన విడుదల చేశారు. దీనితో రాజమౌళి టీమ్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news