నెటిజన్స్ కు గట్టిగా దొరికి పోయిన తమన్.!

-

ప్రస్తుతం తెలుగు సినిమా సంగీతం లో తమన్ మ్యూజిక్ మోస్ట్ వాంటెడ్ గా ఉంది. రీసెంట్ గా  బాలయ్య బాబు మూవీ వీర సింహ రెడ్డి కు తమన్ సంగీతం అందించారు. ఇక్కడే మరో వైపు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.ఇక సినిమాల విడుదల తర్వాత తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. దేవీశ్రీ ప్రసాద్ మాత్రం పాటల విషయంలో పేరు వచ్చింది.

ఇక తమన్ అఖండ లాగా ఈ సినిమా కు పేరు వచ్చింది. ప్రస్తుతం తమన్ మహేష్ బాబు, త్రివిక్రమ్ సంగీతం అందిస్తున్నారు. అయితే తాజాగా తమన్ చేసిన వ్యాఖ్యల వల్ల నెటిజన్స్ కు దొరికి పోయాడు.రీసెంట్ గా ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో `నాటు నాటు`కు గానూ ఆస్కార్ నామినేషన్స్ లో `RRR` సినిమా నిలిచిన విషయం తెలిసిందే.

ఇదిలా వుంటే `RRR` మూవీతో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి రాజమౌళి తీసుకెళ్లాడని దీనికి మీ స్పందన ఏంటి , మీరు కూడా ఆస్కార్ అవార్డు బరిలో ఉండడం కోసం ఏమైనా చేస్తారా అని మీడియా ప్రతినిధుల అడిగితే మా డైరెక్టర్ త్రివిక్రమ్ గారు మమ్ముల్ని ఆస్కార్ అవార్డు స్థాయికి తీసుకు వెళతారు అంటూ నమ్మకంగా చెప్పాడు. దీనితో నెటిజన్స్ ఇప్పటిదాకా పాన్ ఇండియా సినిమా తీయని త్రివిక్రమ్ మిమ్ముల్ని ఆస్కార్ కు తీసుకు వెళతారా అంటూ జోకులు పేల్చుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news