ఇప్పుడు పాలిచ్చే బర్రెని వదిలేసి పొడిచే దున్నపోతును తెచ్చుకున్నట్లైంది : కేటీఆర్

-

కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని కోనరావుపేటలో జరిగిన రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… మార్పు అని లొల్లి పెట్టంగనే వానికెవనికో ఓటు వేసిన్రు.రూ. 2500, రూణమాఫీ, రైతు బంధు వచ్చిందా? అని ప్రశ్నించారు.మార్పు కావాలని అనుకున్నారు.. కానీ ఎట్లైంది.కరెంట్ పోతుందా? నీళ్లకు గోస అయితుందా? ఇప్పుడు అర్థమయ్యే పరిస్థితి వచ్చింది.

కేసీఆర్ పాలననే బాగుండే అని అనిపిస్తోందా?ఏదైనా వస్తువు మన దగ్గర నుంచి పోయినప్పుడే తెలుస్తుంది అని అన్నారు.ఇప్పుడు పాలిచ్చే బర్రెని వదిలేసి పొడిచే దున్నపోతును తెచ్చుకున్నట్లైందని అందరూ అనుకుంటున్నారు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.420 హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి.. అరచేతిలో వైకుంఠం చూపించిండు.రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు దేవుళ్ల మీద ఒట్టేసి కొత్త నాటకం చాలు చేసిండు అని అన్నారు.అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోసం పార్ట్-1 చూపించి ఓట్లేయించుకున్నాడు.పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పుడు మోసం పార్ట్-2 స్టార్ట్ చేసిండు అని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news