అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప.. ఐదేళ్లలో బండి సంజయ్ పీకిందేమీ లేదు? : కేటీఆర్

-

కరీంనగర్ లోక్‌సభ పరిధిలోని కోనరావుపేటలో జరిగిన రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… బండి సంజయ్ ఎప్పుడైనా కోనరావు పేటలో కనిపించిండా? టీవీల తప్ప ఎక్కడైనా కనబడ్డడా? అని ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి బుడ్డా పైసా పనిచేసిండా? పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగిండా? ఏం చేసినవ్ బండి సంజయ్ మా ప్రాంతానికి అంటే జై శ్రీరామ్ అంటాడు.అక్షింతలు పంపించి దేవున్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు అని ధ్వజమెత్తారు.

మనం కూడా యాదగిరి గుట్ట కట్టినం.. కానీ రాజకీయాలకు మతాన్ని వాడకోలేదు.శ్రీరాముడు మనకు దేవుడు కాదా? బండి సంజయ్ రాకముందు మనకు దేవుడు తెల్వదా? రాముని పేరు చెప్పి రామున్ని వీళ్లే కాపాడుతున్నట్లు పిల్లల మనసును కరాబ్ చేస్తున్నారు అని విమర్శించారు. బీజేపీ ఓడిపోతే దేశంలో, రాష్ట్రంలో ఉన్న దేవుళ్లకు అయ్యేది ఏమీ లేదు.బీజేపీకి ఓటు వేస్తే దేవునికి ఓటు వేసినట్లే అన్నట్లు ప్రచారం చేస్తున్నాడు.మన ప్రాంతానికి పనులు కావాలంటే గట్టిగా మాట్లాడేటోళ్లు కావాలె.అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప.. ఐదేళ్లలో బండి సంజయ్ పీకిందేమీ లేదు?  అని విమర్శించారు. బండి సంజయ్ నీకు దమ్ముంటే ఏం పనిచేసినవో చెప్పేందుకు చర్చకు రా.రాజన్న గుడికి, కొండగట్టు అంజన్నకు ఒక్క రూపాయి తెచ్చినవా సంజయ్? అని ప్రశ్నించారు.ఒక్క బడి లేదు, గుడి లేదు, పరిశ్రమ తేలేదు. అలాంటిది నీకు ఎందుకు ఓటు వేయాలే.. అడిగితే గాలి తిరుగుడు తప్ప చేసిందేమీ లేదు అన్నారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news