సూపర్ స్టార్ రజినీకాంత్ ఆధ్యాత్మిక పర్యటనలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. హిమాలయాల నుంచి తన పర్యటన షురూ చేసిన తలైవా.. ఆ తర్వాత ఉత్తరాఖండ్, యూపీ ఇలా అన్ని పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఇటీవలే ఝార్ఖండ్ ముఖ్యమంత్రితో కలిసి రాంచీలో చిత్రాన్ని వీక్షించిన ఆయన.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ మౌర్యతోనూ కలిసి సినిమా చూశారు. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను కలిసిన రజనీ.. ఆ సమయంలో యోగికి పాదాభివందనం కూడా చేశారు.
ఈ విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై పెద్ద ఎత్తు విమర్శలు కూడా వచ్చాయి. రజినీ చేసిన పని చూసి.. ముఖ్యంగా తమిళ ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. తలైవా.. యోగీ కాళ్లు మొక్కడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే తాజాగా తనపై వస్తున్న విమర్శలపై సూపర్ స్టార్ స్పందించారు.
“యోగి, సన్యాసీల పాదాలను తాకి, వారి ఆశ్వీర్వాదాలను తీసుకోవడం నా అలవాటు. నాకన్నా చిన్నవారైనా ఇలానే చేస్తాను. అదే ఇప్పుడు కూడా చేశాను” అంటూ తాను చేసిన పనిని సమర్థించుకున్నారు.
So why did Rajini touch Yogi Adityanath’s feet? I see a lot of ‘OMG he’s so much older’ posts, but Rajini is seeking blessings from the chief priest of the Gorakhnath temple, not from a ‘politician’ or a ‘chief minister’… @rajinikanth is merely practicing his faith https://t.co/nV8Z1188Fx
— Akshita Nandagopal (@Akshita_N) August 19, 2023