రాజుగారి గది సీక్వెల్స్‌లో భాగంగా రెడీ అయిన రాజుగారి గది 3 సినిమా రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సక్వెల్స్‌లో ఇప్పటికే వచ్చిన తొలి రెండు సినిమాల్లో ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ అయితే… రెండో పార్ట్ యావరేజ్ అయినా భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్ నేపథ్యంలో నష్టాలు మిగిల్చింది. ఇక ఇప్పుడు ఓంకార్ మళ్లీ పట్టువదలని విక్రమార్కుడిలా మూడో సీక్వెల్ తెరకెక్కించారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా బడ్జెట్ ఎంత ? ప్రి రిలీజ్ బిజినెస్ ఎంత ? అన్న విషయాలు పరిశీలిద్దాం.
రాజుగారి గది పార్ట్ 1 విషయానికి వస్తే సుమారు రు. 3 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు సుమారు 1.1 కోట్ల షేర్ సాధించింది. ఫైనల్ రన్‌లో ఏపీ, తెలంగాణలో రు. 10.3 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే, వరల్డ్ వైడ్ గా 11.25 కోట్ల షేర్ సాధించి… సూపర్, డూపర్ హిట్ అయ్యింది. రాజుగారి గది 2 విషయానికి వస్తే ఫస్ట్ పార్టీ హిట్ అవ్వడంతో సెకండ్ పార్ట్‌కు ఎక్కువ బడ్జెట్ పెట్టారు.
సినిమాకు క్రేజ్ తీసుకు వచ్చేందుకు అక్కినేని నాగార్జున, సమంత, వెన్నెల కిషోర్ లాంటి స్టార్ పవర్ కూడా యాడ్ చేశారు. రు.25 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాని వరల్డ్ వైడ్ 25 కోట్లకి అమ్మారు. మొదటి రోజు సుమారు 4.1 కోట్ల షేర్ సాధించింది. అలాగే ఓవరాల్ గా ఇరు రాష్ట్రాల్లో 15.4 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే, వరల్డ్ వైడ్ గా 18.15 కోట్ల షేర్ ని సాధించి నష్టాలు మిగిల్చింది.
స్టార్ కాస్టింగ్ ఉన్నా అందుకు తగ్గట్టుగా ఎంగేజింగ్ చేయకపోవడంతో రాజుగారి గది 2కు నష్టాలు తప్పలేదు. ఇక ఇప్పుడు మూడో పార్ట్‌ను కాస్త లిమిటెడ్ బడ్జెట్లో తీశారు. రు. 4-5 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాకి బిజినెస్ ఓవరాల్‌గా రు.10 కోట్ల వరకు అయ్యిందని తెలుస్తోంది. మొదటి రోజు రాజుగారి గది 3 రు. 1.5 – 2 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తుందని అంటున్నారు.