ఆర్టీసీ వర్సెస్ ప్రభుత్వం..ఇక్కట్లో ప్రజలు

-

ఆర్టీసీ సమ్మె రోజురోజుకు ఉద్ధృతమవుతున్న నేప‌ధ్యంలో 13వ రోజుకు స‌మ్మె చేరింది. దీనిపై కార్మిక సంఘాలు వెనక్కి తగ్గడం లేదు.. ఆర్టీసీ పరిరక్షణ కోసం మొదలుపెట్టిన సమ్మె….. ప్రజాస్వామ్య పోరాటంగా రూపాంతరం చెందిందని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంబించింది. తమ సమస్యలు పరిష్కరిస్తే తప్ప కార్మిక సంఘాలు సమ్మె బాట వీడమని స్పష్టం చేశాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని ఐకాస నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమ్మె పరిణామాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బస్సులను నడపాలని, ఇతర ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాల కోసం చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సమ్మె వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బస్సులను నడపాలని, ఇతర ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాల కోసం చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా సీఎం కలెక్టర్ల సమావేశం నిర్వహించి, దిశానిర్దేశం చేయనున్నారు.ఇక ఆర్ టి సి కార్మికులకు ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. డిపోల దగ్గర అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అన్ని డిపోల దగ్గర 144 సెక్షన్ విధించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు.

ఏది ఏమైన‌ప్ప‌టికి సామాన్య ప్ర‌జ‌లు అటు ప్ర‌భుత్వానికి ఇటు కార్మికుల‌కు మ‌ధ్య న‌లిగిపోతున్నారు. ప్రైవేట్ వాహ‌న‌దారుల ఛార్జీలు మోత‌మోగిస్తున్నారు. ప్ర‌భుత్వం ఈ విష‌యం పై త్వ‌ర‌గా స్పందించి స‌మ‌స్య‌ను ఒక కొటిక్కి తీసుకువ‌స్తే బావుంటుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news