రివ్యూ: రాజుగారి గ‌ది 3

-

బ్యాన‌ర్‌: ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
న‌టీన‌టులు: అశ్విన్ బాబు, అవికాగోర్‌, అలీ, బ్ర‌హ్మాజీ, ప్ర‌భాస్ శ్రీను, అజ‌య్‌ఘోష్‌, ఊర్వ‌శి, హ‌రితేజ త‌దిత‌రులు
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
ఎడిట‌ర్‌: గౌతంరాజు
సినిమాటోగ్ర‌ఫీ: ఛోటా కె.నాయుడు
సంగీతం: ష‌బీర్‌
ద‌ర్శ‌క‌త్వం: ఓంకార్‌

బుల్లితెర‌పై యాంక‌ర్‌గా సత్తా చాటిన ఓంకార్ ద‌ర్శ‌కుడిగా మారి రాజుగారి గ‌ది సినిమాతో వెండితెర‌పై కూడా త‌న‌దైన ముద్ర వేశాడు. హ‌ర్ర‌ర్‌, కామెడీ జాన‌ర్‌లో తీసిన ఈ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో వ‌రుస‌గా సీరిస్ ప్లాన్ చేసుకుంటూ వ‌చ్చాడు. రెండో సీక్వెల్‌లో నాగార్జు, స‌మంత లాంటి స్టార్ల‌తో రాజుగారి గ‌ది 2 తీయ‌గా అది అట్ట‌ర్ ప్లాప్ అయ్యింది. అయితే ఆ సినిమా క‌మర్షియ‌ల్‌గా స‌క్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలో మరోసారి హర్రర్‌ కామెడీనే నమ్ముకున్న ఓంకార్‌ రాజుగారి గది-3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అశ్విన్‌బాబు అవికాగోర్ జంట‌గా న‌టించిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా ?  మ‌రి ఈ మూడో సీక్వెల్ ప్రేక్ష‌కుల‌కు ఎంత వ‌ర‌కు కనెక్ట్ అయ్యిందో స‌మీక్ష‌లో చూద్దాం.

క‌థ :
మయా (అవికా గోర్‌) ఓ ఆస్పత్రిలో వైద్యురాలిగా పనిచేస్తుంటుంది. ఆమెను ఎవ‌రైనా ప్రేమించి ఐల‌వ్ యూ చెపితే ఓ ఆత్మ వ‌చ్చి వాళ్ల‌ను చిత‌క్కొట్టేస్తూ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే అదే సిటీలో ఓ కాల‌నీలో ఉండే అశ్విన్ (అశ్విన్‌బాబు) ఆలీతో క‌లిసి ఉంటుంటాడు. ఆటోడ్రైవర్ అయిన అశ్విన్ రోజూ తాగి కాల‌నీ వాసుల‌ను వేధించుకుంని తింటూ ఉంటాడు. అదే కాల‌నీలో మాయ ప‌న‌చేసే హాస్ప‌ట్లోనే ప‌నిచేస్తోన్న మ‌రో డాక్ట‌ర్ శశి (బ్రహ్మాజీ) ఉంటాడు. శ‌శికి అప్పటికే దెయ్యం చేతిలో దెబ్బలు ప‌డ‌తాయి. ఈ క్ర‌మంలోనే ఓ కిటుకు వేసి అశ్విన్ మాయ‌ను ప్రేమించేలా చేస్తాడు.

అశ్విన్‌ కూడా మాయకు ఐలవ్యూ చెప్పడంతో దెయ్యం అతనికి చుక్కలు చూపిస్తుంది. ఈ క్రమంలో అశ్విన్‌కు మాయ గురించి కొన్ని షాకింగ్ విష‌యాలు తెలుస్తాయి. దీంతో కేర‌ళ వెళతాడు. అక్క‌డ గరడపిళ్లైతో తాడో-పెడో తేల్చుకోవడానికి అశ్విన్ రెడీ అవుతాడు. అస‌లు గ‌రుడ‌పిళ్లై ఎవ‌రు ? అశ్విన్ ఎందుకు కేర‌ళ వెళ్లాడు ? ఈ క‌థ‌కు య‌క్షినికి ఉన్న లింక్ ఏంటి ? అన్నది రాజుగారి గ‌దిలోకి వెళ్లి తెలుసుకోవాల్సిందే.

క‌థ‌నం &  విశ్లేష‌ణ :
రాజుగారి గ‌ది 1,2ల‌లో హ‌ర్ర‌ర్‌, కామెడీ ట‌చ్ చేస్తూ చివ‌ర్లో సొష‌ల్ మెసేజ్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు ఓంకార్ ఈ మూడో సీక్వెల్‌కు హ‌ర్ర‌ర్‌, కామెడీ ట‌చ్ చేస్తూ మెసేజ్ మిస్ చేశాడు. అమ్మాయి వెంటపడే వ్యక్తులనే యక్షిని రఫ్‌ ఆడటమనే కాన్సెప్ట్‌ బాగానే ఉన్నా.. కామెడీ ఎక్కువ స్కోప్ ఇచ్చి ప్రేక్ష‌కులు బాగా థ్రిల్‌కు గుర‌య్యే హ‌ర్ర‌ర్‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేయ‌డం ప్రేక్ష‌కుల‌కు నిరాశే. ఫ‌స్టాఫ్‌లో చాలా సాగ‌దీత సీన్లు ప్రేక్ష‌కుడి స‌హ‌నానికి ప‌రీక్ష‌గా మారాయి.

సెకండాఫ్‌లో రాజుగారి గదిలోకి పాత్రలు ఎంటరైన తర్వాత పూర్తిగా కామెడీ మీద ఫోకస్‌ చేయడం కొంత ప్రేక్షకులకు నిరాశకు గురిచేయవచ్చు. అంతగా భయపెట్టి థ్రిల్‌ చేసే అంశాలు సినిమాలో లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు. ప్రీక్లైమాక్స్‌లో వ‌చ్చే 20 నిమిషాల‌ హార‌ర్ కామెడీ ఎలిమెంట్స్ ప్రేక్ష‌కుల‌ను బాగా న‌వ్విస్తాయి.

ఓవ‌రాల్‌గా ద‌ర్శ‌కుడు ఓంకార్ టేకింగ్ బాగున్నా కొన్ని సీన్లు ఇంకాస్త ఎంగేజింగ్‌గా చెపితే బాగుండును అనిపించింది. సినిమా రెండు గంట‌లే ఉన్నా కొన్ని సీన్లు సాగ‌దీసిన‌ట్టు ఉన్నాయి. కేవలం మాస్ కామెడీని నమ్ముకుని సినిమాను లాగించేశాడు. కథాకథనాల మీద ఏమాత్రం కసరత్తు చేయలేదు. మరీ నాటుగా సాగిపోయే అతడి కామెడీ ఓ వర్గం ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది.

హీరో అశ్విన్‌ బాబు.. ఈ సినిమాలోనూ తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. యాక్టింగ్‌ పరంగా కొంచెం మెరుగయ్యాడు. కానీ డైలాగ్ డెలివ‌రీలో ఇంకా త‌డ‌బాటు ఉంది. మాయగా అవికా గోర్‌ అందంగా కనిపించింది. కొంచెం బొద్దుగా ఉన్నప్పటికీ తన నటనతో పర్వాలేదనిపించింది.

ఇక ఆలీ, బ్ర‌హ్మాజీ, శివశంకర్‌ మాస్టార్‌, గెటప్‌ శ్రీను తదితరులు కాసింత నవ్వులు పంచారు.సెకండ్‌ హాఫ్‌లో  గరడ పిళ్లై, రాజమాతలుగా అజయ్‌ ఘోష్‌,  సీనియర్‌ నటి ఊర్వశీలు.. అలీ, అశ్విన్‌ తోడుగా దెయ్యాలతో కలిసి హర్రర్‌ కామెడీ పండించారు.  టెక్నిక‌ల్‌గా కూడా సినిమా ఉన్న‌తంగా ఉండేలా చూసుకున్నారు. చోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ, ష‌బ్బీర్ నేప‌థ్య సంగీతం, బుర్రా సాయిమాధ‌వ్ పంచ్ డైలాగులు బాగా పేలాయి.

ఫైన‌ల్‌గా…
ఈ మూడో దెయ్యం భ‌య‌పెట్ట లేదు గాని… కాస్త‌ న‌వ్వించింది

రాజుగారి గ‌ది 3 రేటింగ్‌: 2.25 / 5

Read more RELATED
Recommended to you

Latest news