బ్రేకింగ్‌: ఆర్టీసీ సమ్మె విష‌యంలో ప్ర‌భుత్వంపై హైకోర్టు సీరియ‌స్‌..

ఆర్టీసీ సమ్మెపై తెలంగాణ హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ఆర్టీసీ సమ్మె పై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం విచారణ కొనసాగుతోంది. ఆర్టీసీ కొత్త ఎండీని ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు రెండు వారాలుగా సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రభుత్వం తరుపు న్యాయవాది అడిగింది. అయితే . సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి ఆర్టీసీని చూసుకుంటున్నారని.. ఆ అధికారికి ఆర్టీసీ పై పూర్తి అవగాహన ఉందని అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో సీనియర్‌ అధికారి ఉన్నప్పుడు 14 రోజులుగా కొనసాగుతున్న సమ్మెను ఎందుకు నివారించలేకపోయారని కోర్టు ప్రశ్నించింది.

ఈ క్ర‌మంలోనే న్యాయస్థానం పలు కీలక వ్యాఖలు చేసింది. సమ్మెను ప్రభుత్వం నిలువరించలేకపోతే.. భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది. ప్రజలు శక్తివంతులని వాళ్లు తిరగబడితే, ఆపడం సాధ్యం కాదని వ్యాఖ్యానించింది. వాటిలో 20 డిమాండ్లు పూర్తిగా పరిష్కారమయ్యే డిమాండ్లేనని, మరి ప్రభుత్వం ఎందుకు వాటిని పరిష్కరించడంలో చొరవ చూపలేదని కోర్టు అడిగింది. దీనిపై విచారణ ఘాటుగా కొనసాగుతోంది.