Rakul Preet: ఆలోచనలో పడిపోయిన రకుల్..అసలు కారణం అదే!!

ఫిట్‌నెస్ ఫ్రీక్‌గా పేరు పొందిన అందాల తార రకుల్ ప్రీత్ సింగ్..2013లో మెర్లపాక గాంధీ తెరకెక్కించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మూవీతో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టి సక్సెస్ అందుకున్నది. ఇక ఆ తర్వాత వచ్చిన అవకాశాలన్నిటినీ సద్వినియోగం చేసుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించింది.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ సోషల్ మీడియా క్వీన్ గా పేరు గాంచింది. తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో ‘మీకు తెలుసా? నేను ఆలోచిస్తున్నానని’ అనే హ్యష్ ట్యాగ్ తో ఆకుపచ్చ రంగు స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకొని స్టన్నింగ్ లుక్స్‌తో కూర్చొని ఉన్న ఫొటోని అభిమానులతో పంచుకుంది. సదరు ఫొటోలో తన థైస్ తో హాట్ షో చేసింది ఈ బ్యూటీ.

ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘ఏంటి రకుల్ నిజంగానే ఏదో ఆలోచనలో పడిందా?’ అని షాక్ అవుతున్నారు. ‘ఆఫ్టర్ లాంగ్ టైం లుకింగ్ గాడ్జియస్, వెరీ నైస్ లుకింగ్’ అని పోస్టులు పెడుతున్నారు. రకుల్ ప్రస్తుతం ‘థ్యాంక్ గాడ్, డాక్టర్ G’ చిత్రాలలో నటిస్తోంది.

https://www.instagram.com/p/Cdad8JDKb8_/?igshid=MDJmNzVkMjY=