ర‌కుల్ కి ఎవ‌డైనా ఓకే అట‌..

-

ఇటీవ‌ల ఘాటైన అందాల‌తో ఫ్యాన్స్ నే కాదు, జ‌న‌ర‌ల్ ఆడియెన్స్ ని ఫిదా చేస్తున్న‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్ కి ప్రేమ క‌రువు వ‌చ్చింద‌ట‌. అర్జెంట్ గా ల‌వ్‌లో ప‌డేందుకు తెగ త‌పిస్తోంది. అంతేకాదు ప్రేమించేందుకు ఎవ‌డైనా ఓకే , ఫ‌స్ట్ ప్రియుడు కావాలి అంటోంది. మ‌రి ఈ హాట్ బ్యూటీ అలా అన‌డం వెనుక కార‌ణం ఏంట‌ని అన్వేషిస్తే.. ప్ర‌స్తుతం ఆమె బాలీవుడ్‌లో అజ‌య్ దేవ‌గ‌న్‌తో క‌లిసి దే దే ప్యార్ దే సినిమాలో న‌టిస్తుంది. ట‌బు ఇందులో మరో నాయిక.

సినిమాలో అజ‌య్ ఏజ్ 56. ఆయ‌నకు ట‌బులో వివాహ‌మ‌వుతుంది. కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ ఇద్దరు దూరంగా ఉంటారు. దీంతో అజ‌య్ 23ఏండ్ల అంద‌మైన అమ్మాయి ర‌కుల్‌తో ప్రేమ‌లో ప‌డ‌తారు. విష‌యం తెలుసుకుని ట‌బు క‌మ్‌బ్యాక్ అవడంతో అజ‌య్, రకుల్ ప్రేమ వ్య‌వ‌హారం ఎలాంటి ట‌ర్న్ లు, ట్విస్ట్ లు తీసుకుంద‌నేది క‌థ‌. అకివ్‌ అలీ దర్శకత్వంలో రూపొందిన ఈ రొమాంటిక్‌ కామెడీ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా ర‌కుల్ మీడియాతో ముచ్చ‌టించింది. సినిమాలో లాగా రియ‌ల్ లైఫ్‌లో ల‌వ్‌లో ప‌డ‌తారా? అని యాంక‌ర్ అడిగిన క్వ‌శ్చ‌న్‌కి స్పందిస్తూ, ప్రస్తుతం నేను ప్రేమలో పడేందుకు రెడీగా ఉన్నా. నా ప్రేమికుడు వ‌య‌సులో నా కంటే పెద్దవాడా, చిన్నవాడా అనేది మ్యాటర్‌ కాదు (నవ్వుతూ). ప్రేమకి వయసు కొలమానం కాదు.

అది అడ్డు కూడా రాదు అని బోల్డ్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చి అందరికీ షాక్‌ ఇచ్చింది. గతంలోనూ ప్రేమలో పడేందుకు సిద్ధంగా ఉన్నా అని తెలిపిన విషయం విదితమే. మరోసారి ఆమె ఇలాంటి స్టేట్‌మెంట్‌ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ స్టేట్ మెంట్ పెళ్ళికానీ ప్ర‌సాద్‌ల‌కి బంప‌ర్ ఆఫ‌ర‌నే చెప్పాలి. ప్రస్తుతం ఆమె హిందీలో ‘ఎన్జీకే’, ‘మన్మథుడు 2’, ‘మర్జావాన్ తోపాటు త‌మిళంలో శివ‌కార్తికేయ‌న్ తో ఓ సినిమా చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version