పోర్న్ చిత్రాల‌ని త‌ల‌పిస్తున్న‌ ఏడు చేప‌ల క‌థ టీజ‌ర్…

-

అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 త‌ర్వాత అడ‌ల్ట్ కంటెంట్ చిత్రాలు జోరు డే బై డే పెరుగుతోంది. న‌ట‌న‌, అంత‌కు మించి, చీక‌టి గ‌ది చిత‌క్కొట్టుడు సినిమాలు వ‌చ్చి కుర్ర‌కారుకి నిద్ర ప‌ట్ట‌కుండా చేశాయి. ఇటీవ‌ల విడుద‌లైన డిగ్రీకాలేజ్ ట్రైల‌ర్ సైతం అడ‌ల్ట్ కంటెంట్‌తో నిండిపోయింది. ఇది సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. ఇప్పుడు దానికి మొగుడు అనేలా ఉంది ఏడు చేప‌ల క‌థ రెండో టీజ‌ర్‌. గ‌తంలో వ‌చ్చిన మొద‌టి టీజ‌ర్ సంచ‌ల‌నం క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా రిలీజైన టీజ‌ర్ 2 సైతం దానికి మించి ఉంది.

టెమ్ట్ ర‌వి పాత్ర ప్ర‌ధానంగా రూపొందే ఈ సినిమా మ‌గాడిపై మ‌హిళ‌ల అత్యాచారం చేస్తే అన్న కాన్సెప్ట్ తో సాగుతుంద‌ని చిత్ర ద‌ర్శ‌కుడు శ్యామ్ జే చైత‌న్య చెబుతున్నారు. కాన్సెప్ట్ ప‌క్క‌న పెడితే సినిమా మ‌ల‌యాళ పోర్స్ చిత్రాల‌ని త‌ల‌పిస్తుంద‌ని చెప్ప‌డంలో ఏమాత్రం సందేహం లేదు. టీజ‌రే ఇలా ఉంటే ఇక ట్రైల‌ర్‌, సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. అడ‌ల్ట్ సినిమాల‌ని ఇష్ట‌ప‌డే ఆడియెన్స్ కి పండ‌గే పండ‌గ. ఇందులో టెమ్ట్ ర‌వి పాత్ర‌లో నూత‌న న‌టుడు అభిషేక్ రెడ్డి న‌టిస్తున్నారు. బిగ్ బాస్ ఫేం భాను శ్రీ, ఆయేషా సింగ్, నగరం సునీల్ ఇత‌ర పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రాన్ని చరిత సినిమా ఆర్ట్స్ పతాకం మీద డా.రాకేష్ రెడ్డి గూడూరు సమర్పణలో శేఖర్ రెడ్డి, జివిఎన్ నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version