న‌టి ఝాన్సీకి లిప్ కిస్ ఇచ్చిన ర‌కుల్‌.. మ‌న్మ‌థుడు 2 మూవీలో షాకింగ్ వీడియో లీక్‌..!

-

ప్ర‌ముఖ న‌టుడు నాగార్జున, గ్లామ‌ర‌స్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సినిమా.. మ‌న్మ‌థుడు 2. ఈ మూవీ టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తోనే అభిమానుల్లో భారీగా అంచ‌నాలు పెంచేసింది.

ప్ర‌ముఖ న‌టుడు నాగార్జున, గ్లామ‌ర‌స్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌లు ప్ర‌ధాన పాత్ర‌ల్లో శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సినిమా.. మ‌న్మ‌థుడు 2. ఈ మూవీ టీజ‌ర్‌, ట్రైల‌ర్‌తోనే అభిమానుల్లో భారీగా అంచ‌నాలు పెంచేసింది. ఈ క్ర‌మంలోనే ఇవాళ విడుద‌లైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వ‌స్తున్న‌ట్లు మ‌న‌కు ప్రేక్ష‌కుల ట్విట్ట‌ర్ పోస్టుల‌ను బ‌ట్టి తెలుస్తుంది. అయితే మూవీలో ఉన్న ఒక సీన్ మాత్రం ఇప్పుడు ప్రేక్ష‌కుల‌ను షాక్‌కు గురి చేస్తోంది.

మ‌న్మ‌థుడు 2 మూవీలో ఓ స‌న్నివేశంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టి ఝాన్సీని లిప్ టు లిప్ కిస్ పెట్టుకుంటుంది. అయితే మూవీ ప్ర‌మోష‌న్స్‌లో ఎక్క‌డా మ‌న‌కు ఈ సీన్ క‌నిపించ‌లేదు. టీజ‌ర్‌, పోస్ట‌ర్లు, ట్రైల‌ర్ల‌లోనూ కేవ‌లం నాగ్‌, ర‌కుల్‌, వారి కుటుంబ స‌భ్యుల‌ను మాత్ర‌మే చూపించారు. కానీ ఇలాంటి ఒక సీన్ ఈ మూవీలో ఉంటుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. దీంతో ఈ సీన్‌ను చూసిన ప్రేక్ష‌కులంతా షాక్‌కు గుర‌వుతున్నారు. అస‌లు ఝాన్సీ ఏంటి.. ఇలాంటి సీన్‌లో న‌టించింది.. అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే మ‌న్మ‌థుడు 2 మూవీలో ఉన్న ఈ లిప్‌లాక్ సీన్ మాత్రం సింగ‌ర్ చిన్మ‌యికి మ‌రొక కొత్త త‌ల‌నొప్పిని తెచ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఎందుకంటే ఈ మూవీకి చిన్మ‌యి భ‌ర్త రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే గ‌తంలో చిన్మ‌యి అర్జున్ రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్ వంగాపై అసభ్య‌క‌ర సీన్ల గురించి కామెంట్ చేసి ట్విట్ట‌ర్‌లో అడ్డంగా దొరికిపోయింది. నీ భ‌ర్త అలాంటి సీన్లు ఉండే సినిమాలు తీస్తే త‌ప్పేం లేదు, కానీ ఇత‌రుల గురించి కామెంట్లు చేస్తావా.. అంటూ చిన్మ‌యిని అస‌భ్య ప‌ద‌జాలంతో దూషిస్తూ నెటిజ‌న్లు ఆడుకున్నారు. ఇక ఇప్పుడు మ‌న్మ‌థుడు 2 మూవీలో ఏకంగా లెస్బియ‌న్ లిప్‌లాక్ సీన్ ఉండ‌డంతో ప్రేక్ష‌కులు ఈ సారి ఈ సీన్‌పై ఎలా స్పందిస్తారో, చిన్మ‌యికి ఎలా కౌంట‌ర్ ఇస్తారో వేచి చూడాలి. ఏది ఏమైనా.. ర‌కుల్‌, ఝాన్సీల మ‌ధ్య ఉన్న ఈ లిప్‌లాక్ సీన్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది..!

Read more RELATED
Recommended to you

Latest news