బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన NMC బిల్లు పై రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వైద్య విద్యార్ధులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపడుతున్న విషయం అందరికి విధితమే. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య విద్యార్ధులు అందరూ ఈ బిల్లుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవలు అన్నిటినీ నిలిపివేశారు. అయినప్పటికీ ప్రభుత్వం నుంచీ ఎటువంటి స్పందన లేకపోవడంతో తమ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ నిరసనకి ఉద్యమకారులు, పలు ఉద్యమ సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి. ఇదిలాఉంటే హైదరాబాద్ లో నిరసన తెలుపుతున్న డాక్టర్ల వద్దకి ప్రముఖ హీరో, వైసీపీ నేత అయిన డాక్టర్ రాజశేఖర్ ప్రత్యక్షమయ్యారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాజశేఖర్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. కేంద్రం తీసుకువచ్చిన ఈ బిల్లుని డాక్టర్ గా తాను వ్యతిరేకిస్తున్నట్టుగా ఆయన అన్నారు.
సోషల్ మీడియాలో సైతం కేంద్ర నిర్ణయంపై నిప్పులు చెరిగిన రాజశేఖర్ సమ్మె చేస్తున్న డాక్టర్ల వద్దకి వెళ్లి సంఘీభావం తెలుపడం పెద్ద చర్చనీయాంశం అయ్యింది. కేవలం నిరసన తెలిపితే సరిపోయేదేమో కానీ రాజశేఖర్ మాత్రం ఒకడుగు ముందుకు వేశారు. NMC బిల్లుపై నిపుణులు సూచనలు పాటించాలని సలహా ఇచ్చారు. ఈ ఊహించని పరిణామంతో ఒక్క సారిగా అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతానికి బీజేపీ ఎటువంటి నిర్ణయ తీసుకున్నా సరే అడ్డు చెప్పని వైసీపీ , ఇప్పుడు ఏకంగా కేంద్రం ప్రవేశ పెట్టిన బిల్లుపై తమ వైసీపీ నేత అయిన రాజశేఖర్ కామెంట్స్ చేయడంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థతి ఏర్పడింది.
ఎన్నికల ముందు వైసీపీలోకి జంప్ చేసిన జీవిత రాజశేఖర్, ఎనికల సమయంలో వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే వైసీపీ అధికారంలోకి వస్తే వారికి పార్టీ పరంగా జగన్ ఏదోఒక పదవి ఇస్తారని భావించారు అందరూ. అయితే ఇప్పటికే ఉన్న నేతలకి పదవులు సర్దుబాటు చేయలకే సతమతమవుతున్న జగన్ తమకి పదవులు ఇస్తాడో లేదో అనే ఆలోచనలో పడ్డ జీవితా రాజశేఖర్. జగన్ దృష్టిని మరోమారు ఆకర్షించే భాగంలోనే ఈ వ్యాఖ్యలు చేశారని అంటుంటే, వైసీపీ నేతలు మాత్రం ఈ వ్యాఖ్యలని లైట్ తీసుకోమంటున్నారు. మరి ఈ వైసీపీ హీరో బీజేపీకి షాక్ ఇచ్చాడో లేక సదరు హీరోకి బీజేపీ షాక్ ఇస్తుందో వెయిట్ అండ్ సీ..