చరణ్ దీవాళి కానుక

-

రాం చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మూవీ సెట్స్ మీద ఉంది. ఈ సినిమాకు సంబందించిన టైటిల్ గా రెండు మూడు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అసలు టైటిల్ ఏంటన్నది తెలుసుకోవాలని మెగా ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు. దసరాకు ఫస్ట్ లుక్ వస్తుందని భావించిన మెగా ఫ్యాన్స్ నిరుత్సాహపడినా దీవాళికి సర్ ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాడు మెగా పవర్ స్టార్. రేపు అనగా నవంబర్ 6న మధ్యాహ్నం ఒంటి గంటకు చరణ్ సినిమా ఫస్ట్ లుక్ వస్తుంది.

డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా గురించి ఈ అఫిషియల్ న్యూస్ వారి ట్విట్టర్ ఖాతా ద్వారా వెళ్లడించారు. ఇక నవంబర్ 9న ఉదయం 10:25 గంటలకు ఈ సినిమా టీజర్ కూడా రిలీజ్ చేస్తున్నారట. దీపావళికి మెగా హంగామా షురూ చేసేలా చరణ్ తన సినిమా అప్డేట్స్ ఇచ్చాడు. కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

మరి చరణ్ దీవాళి కానుకగా ఎలా ఉండబోతుందో చూడాలి. 2019 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రాబోతుందని తెలుస్తుంది. మాస్ అండ్ యాక్షన్ డైరక్టర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న బోయపాటి శ్రీను చరణ్ తో చేస్తున్న సినిమా ద్వారా ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version