గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో ఓ యువకుడు సోమవారం ఉదయం కత్తి పట్టుకొని కేకలు వేస్తూ నడిరోడ్డుపైకి వచ్చాడు.తన జనతాగ్యారేజ్‌కి సమస్యలు చెప్పాలంటూ గట్టిగా అరుస్తూ రోడ్డుపై అటూ ఇటూ తిరగసాగాడు. దీంతో జనం భయాందోళనకు గురయ్యారు. అతన్ని చూసి ఒక్కసారిగి పరుగులు తీశారు. ఆ యువకుడు కత్తి పట్టుకొని ఫోన్ మాట్లాడూతూ.. ‘నా దగ్గరకి రా. క్షణాల్లో పరిష్కరిస్తా’ అంటూ కేకలు వేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అంతే కాదు ఆ యువకుడు జనతా గ్యారేజ్ పేరుతో ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ‘ఎవరికైనా ఏదైన సమస్యలు ఉంటే వెంటనే గ్రూప్‌లో పెట్టండి.
జనతా గ్యారేజ్ మీకు న్యాయం చేస్తుంది. జయహో జనతా ’అంటూ మెస్సేజ్ చేశారు. సమస్యలు ఉంటే నాకు ఫోన్ చేయ్యడంటూ ఓ నెంబర్‌ను కూడా గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. ఆ యువకుడి పేరు ప్రదీప్ అని ఏఎస్పీ లక్ష్మినారాయణ మీడియాకు వెల్లడించారు. ఉండవల్లికి చెందిన సందీప్‌తో వివాదాల నేపథ్యంలో ప్రదీప్ కత్తిపట్టుకుని తిరుగుతున్నట్లు వెల్లడించారు. గతంలో కూడా ప్రదీప్‌పై రెండు కేసులు నమోదైనట్లు ఏఎస్పీ చెప్పారు. ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని ఐపిసి సెక్షన్ 307, రెడ్‌విత్ 34, ఇండియన్ ఆయుధాల చట్టం యాక్ట్ సెక్షన్ 24 ప్రకారం కేసు పెట్టినట్లు తెలిపారు.