సైరా ద‌ర్శ‌కుడికి క‌ళ్లు చెదిరే ఆఫ‌ర్‌

-

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రముఖ స్వాతంత్య్ర‌ సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమా థియేట‌ర్ల‌లోకి వచ్చేందుకు మరో ఒక రోజు టైం మాత్రమే ఉంది. రు. 280 కోట్ల భారీ బడ్జెట్‌తో ఓ చారిత్రక యోధుడి సినిమాను తెరకెక్కించడం అంటే మామూలు విషయం కాదు. ఈ చరిత్ర జరిగి దశాబ్దాలు గడుస్తున్నా దీని గురించి అటు చరిత్రకారులు.. ఇటు ప్ర‌భుత్వాలు కానీ వెలికితీసిన సంఘటనలు తక్కువే. ఓ చారిత్రక వీరుడు, యోధుడు, ధీరుడు చరిత్ర తెరకెక్కించాలంటే చాలా గుండె ధైర్యం కావాలి.

టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎంత గ‌ట్స్ ఉన్నది దర్శకధీరుడు రాజమౌళికి మాత్రమే. ఇప్పుడు రాజమౌళి తర్వాత అంతటి గట్స్, టాలెంట్ ఉన్న దర్శకుడు సురేందర్ రెడ్డి అని చెప్పక తప్పదు.
టిఫిక‌ల్ కథాంశంతో మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో ను డైరెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. తొలి తెలుగు స్వాతంత్య్ర‌ సమరయోధుడిగా అందరిచేత ప్రశంసలు అందుకుకుంటోన్న‌ సైరా నరసింహారెడ్డి జీవిత చరిత్రను తెర మీదకు తీసుకొచ్చేందుకు సురేందర్రెడ్డి పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు.

దాదాపు మూడు సంవత్సరాల పాటు సురేందర్ రెడ్డి ఈ సినిమాకు పనిచేశారు. ఈ క్రమంలోనే ఇంత కష్టపడి నందుకు సురేందర్ రెడ్డికి రామ్‌చ‌రణ్ అదిరిపోయే రెమ్యున‌రేష‌న్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ రెమ్యున‌రేష‌న్‌ చూస్తే కళ్ళు తిరిగి ఆఫర్ అని చెప్పక తప్పదు. నిర్మాత రామ్‌చ‌ర‌ణ్ మొత్తం రు.12 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. రాజ‌మౌళి, కొర‌టాల శివ త‌ర్వాత టాలీవుడ్‌లో ఇదే హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ అన్న టాక్ కూడా న‌డుస్తోంది. ఈ సినిమా హిట్ అయితే సురేంద‌ర్‌రెడ్డి రేంజ్ మామూలుగా ఉండ‌దు.

Read more RELATED
Recommended to you

Latest news