రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. గేమ్ ఛేంజర్ నుంచి ‘జరగండి’ సాంగ్ రిలీజ్

-

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ కలిసి నటిస్తున్న రెండో సినిమా గేమ్ ఛేంజర్. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దరశకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ను ఇవాళ చిత్ర బృందం విడుదల చేసింది. మార్చి 27వ తేదీన హీరో రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ‘జరగండి’ సాంగ్ను రిలీజ్ చేశారు. ఈ పాటకు చెర్రీ, హీరోయిన్ కియారాతో స్టెప్పులు అదరగొట్టేశారు.

ఈ పాటను దలేర్ మహందీ, సునిధీ చౌహాన్ పాడగా.. అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. రామ్చరణ్కు బర్త్ డే విషెస్ చెప్తూ, సాంగ్ అదిరిపోయిందంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.  మరోవైపు తన పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. కుమార్తె క్లీంకారతో కలిసి స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news