చిట్టిబాబు అతనితో ఫిక్స్ అయ్యాడా..!

-

రంగస్థలంతో సూపర్ హిట్ అందుకున్న రాం చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా తర్వాత ఎన్.టి.ఆర్ తో కలిసి మల్టీస్టారర్ చేస్తున్న చరణ్ ఆ తర్వాత సినిమా కూడా లైన్ లో పెట్టుకున్నాడు. తెలుస్తున్న సమాచారం ప్రకారం వంశీ పైడిపల్లితో చరణ్ తర్వాత సినిమా ఉంటుందని అంటున్నారు.

ఊపిరి తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న వంశీ పైడిపల్లి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో మహర్షి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా 2019 ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. ఫిబ్రవరి కల్లా మహర్షి నుండి ఫ్రీ అవుతాడు వంశీ పైడిపల్లి అయితే రాం చరణ్ తో సినిమా అంటే రాజమౌళి ట్రిపుల్ ఆర్ పూర్తయ్యేదాకా ఆగాల్సిందే. అంటే మరో సంవత్సరం పాటు మళ్లీ వంశీ పైడిపల్లి వెయిట్ చేయాల్సిందే.

చరణ్ కోసం అప్పటిదాకా వెయిట్ చేస్తాడా లేక మధ్యలో మీడియం రేంజ్ హీరోతో సినిమా చేస్తాడా అన్నది చూడాలి. రంగస్థలం చిట్టిబాబు తన సినిమాల సెలక్షన్స్ లో కూడా అదరగొడుతున్నాడు. చూస్తుంటే మెగా పవర్ స్టార్ టైం స్టార్ట్ అయ్యిందని అనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news