రాం చరణ్ కు రంగస్థలం.. చైతుకి మజిలీ.. సెన్సార్ టాక్ అదుర్స్..!

-

అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా నటించిన సినిమా మజిలీ. శివ నిర్వాణ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రేపు అనగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. పెళ్లి తర్వాత చైతు, సమంతలు కలిసి చేస్తున్న సినిమాగా మజిలీ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా సెన్సార్ నుండి యు/ఏ సర్టిఫికెట్ పొందింది. సెన్సార్ నుండి సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చింది.

రాం చరణ్ కు రంగస్థలం ఎంత పేరు తెచ్చిందో నాగ చైతన్యకు మజిలీ అంత మంచి పేరు తెస్తుందని అంటున్నారట. మజిలీలో క్రికెట్, ప్రేమ రెండిటిని ఎంతో ఇష్టపడి వాటిని కోల్పోయిన వ్యక్తిగా చైతు నటిస్తాడట. సినిమాలో చైతుతో పాటుగా సమంత నటన ఆకట్టుకుంటుందని అంటున్నారు. సమంత కాకుండా ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమాకు బిజిఎం మాత్రం తమన్ అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news