అక్కినేని అఖిల్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మిస్టర్ మజ్ను. బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నెల 25న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈమధ్య జరిగింది. ఎన్.టి.ఆర్ చీఫ్ గెస్ట్ గా రాగా ఆ ఈవెంట్ లో తారక్ చేతుల మీదగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమా ట్రైలర్ చూస్తే డిఫరెంట్ లవ్ స్టోరీగా వెంకీ తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ ట్రైలర్ కు ఆడియెన్స్ లో మంచి స్పందన రాగా అఖిల్ మిస్టర్ మజ్ను ట్రైలర్ లో లేటుగా అయినా లేటెస్ట్ గా స్పందించాడు మీగా పవర్ స్టార్ రాం చరణ్. మిస్టర్ మజ్ను ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది.. ఆల్ ది బెస్ట్ అంటూ చెర్రి తన ఫేస్ బుక్ ఖాతాలో కామెంట్ పెట్టడం విశేషం. తారక్ గెస్ట్ గా వచ్చి సినిమా సక్సెస్ ఆకాంక్షించగా చెర్రి తన విష్ తో అది మరింత బలపడేలా చేశాడు. మరి అఖిల్ కు ఈ సినిమా అయినా హిట్ ఖాతా తెరుస్తుందో లేదో చూడాలి.