Ram Charan-Shankar: చ‌ర‌ణ్,శంక‌ర్ మూవీ క్రేజీ అప్డేట్! ఒక్క ఫైట్ సీన్ కోసం..10 కోట్ల బ‌డ్జెటా!

-

Ram Charan-Shankar: టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ బ‌డ్జెట్ సినిమా తెర‌కెక్క‌నున్న‌ది. RC15 వర్కింగ్ టైటిల్‌లతో వస్తున్న ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటించనుంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించనున్న ఈ చిత్రానికి దిల్ రాజ్ నిర్మాత‌గా వ్య‌వ‌స్తున్నారు. దాదాపు 200 కోట్లు ఖర్చు చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఇటీవల ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక వచ్చే నెల నుంచి ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కాబోతుంది.

అయితే..ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా గురించిన ఓ క్రేజీ అప్‌డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో భారీ యాక్షన్ ఫైట్ కు ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ భారీ ఫైట్ కోసం.. ఏకంగా ప్రత్యేక రైలు సెట్ ను కూడా నిర్మిస్తున్నారట. ఆ ఫైట్ సీన్‌లో వందమంది ఫైటర్లు పాల్గొననున్నట్టు స‌మాచారం. దాదాపు 15 నిమిషాలకు పైగా సాగే ఈ ఎపిసోడ్ చిత్రానికే హైలైట్ సీన్ కానుందని సమాచారం. ఈ సన్నివేశం కోసం ఏకంగా 10 కోట్లలో బడ్జెట్ కేటాయిస్తున్నారట.

దీంతో ఈ ఫైట్ సీన్ ఏ రేంజ్ లో ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో శ్రీకాంత్, సునీల్, అంజలి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్న‌ట్టు స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news