మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వస్తున్న సినిమా వినయ విధేయ రామ. ఈ సినిమాకు సంబందించి ఓ ట్రెడిషన్ లుక్ ఒకటి ఈరోజు కార్తిక పౌర్ణమి సందర్భంగా రిలీజ్ చేశారు. మొన్న టీజర్ లో మాస్ లుక్ తో అదరగొట్టిన రాం చరణ్ ఈసారి క్లాసిక్ లుక్ తో సర్ ప్రైజ్ చేశాడు. రంగస్థలం తర్వాత రాం చరణ్ చేస్తున్న సినిమా కాబట్టి వినయ విధేయ రామ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.
టీజర్ దమ్ము చూపించగా సంక్రాంతికి సినిమా మరో సంచలనం కాబోతుందని అంటున్నారు. కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వివేక్ ఓబేరాయ్ విలన్ గా నటిస్తున్న వివిఆర్ మూవీలో కోలీవుడ్ హీరో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ లు కూడా నటిస్తున్నారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ మూవీ ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.