గంటలో 1 మిలియన్.. వి.వి.ఆర్ ట్రైలర్ విధ్వంసం

-

మెగా పవర్ స్టార్ రాం చరణ్ చేస్తున్న వినయ విధేయ రామ సినిమా ట్రైలర్ గంటలోనే విధ్వంసం సృష్టిస్తుంది. బోయపాటి శ్రీను డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. కె.టి.ఆర్ స్పెషల్ గెస్ట్ గా వచ్చిన వి.వి.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.

ట్రైలర్ చూస్తే పక్కా బోయపాటి మార్క్ మూవీ అనిపించేలా ఊర మాస్ లుక్ లో చరణ్ విధ్వంస సృష్టిస్తున్నాడు. ట్రైలర్ రిలీజ్ అయిన గంటలోనే 1 మిలియన్ వ్యూస్ తో రికార్డులు మొదలుపెట్టాడు చరణ్. ట్రైలర్ చివరలో చరణ్ టాటూలతో గొలుసులేసుకుని విలన్ ను లాక్కొచ్చే సీన్ చూస్తే మాటల్లేవనేలా ఉంది.

ఈ సంక్రాంతికి అసలు సిసలు బాక్సాఫీస్ షేక్ చేసే బొమ్మగా వినయ విధేయ రామ వస్తుంది. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version