ప్రస్తుత సమాజంలో సోషల్ మీడియా, ఇంటర్నెట్ ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో.. సినిమాల విషయంలో పైరసీ భూతం కూడా అంటే అభివృద్ధి చెందింది. ఇండస్ట్రీ అనేది సంబంధం లేకుండా అన్ని భాషా చిత్రాలని పైరసీ భూతం పట్టి పీడిస్తుంది. దర్శక నిర్మాతలు ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, పైరసీదారులని అరికట్టలేకపోతున్నారు. చిన్న సినిమాలకే భారీ బడ్జెట్‌తో ఎంతో కష్టపడి తీసిన సినిమాలకు అదే పరిస్థితి పట్టింది. తాజాగా ఈ లిస్టు లోకి సైరా సినిమా కూడా చేరిపోయింది. భారీ అంచనాలతో నిన్ని ఈ సినిమా థియేటర్‌లోకి వచ్చింది.
అయితే అలా రిలీజ్ అయ్యిందో లేదో కొన్ని గంటల్లోనే ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుంది. ఈ చిత్ర నిర్మాత రాంచరణ్ ఎవరైనా పైరసీ చేస్తే తమకు మెయిల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే ఆ మెయిల్ కి కొన్ని వేల కంప్లైంట్స్ రావడంతో రాంచరణ్ టెన్సన్‌లో పడ్డారు. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోని ఇలాంటి తలనొప్పి రావడంతో.. రాంచరణ్ ఇలాంటి వారిపై కేసులు పెట్టబోతున్నానని హెచ్చరించాడు. సైరా యూనిట్ మొత్తం దీనిపై చాలా సిరియస్ గా ఆలోచిస్తున్నారు.