ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దీన్ని ఎవరూ ఊహించి ఉండరు: RGV

-

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ట్వీట్ చేశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం ట్విటర్‌లో షేర్‌ చేసిన వీడియోను రీట్వీట్‌ చేసిన ఆర్జీవీ దానిపై అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘భారతీయ దర్శకుడు ఇలాంటి క్షణాలను అనుభవిస్తాడని ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ చరిత్రలో దాదాసాహెబ్‌ ఫాల్కే నుంచి ఇప్పటి వరకూ ఎవరూ (రాజమౌళి సహా) ఊహించి ఉండరు’ అని ట్వీట్ చేశారు. దీనిపై పలువురు సినీ అభిమానులు స్పందించారు. ‘మిమ్మల్నీ ఇలా చూడాలనుకుంటున్నాం’, ‘మీదీ అదే రేంజ్‌ సర్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. అమెరికాలో జరిగిన ఆ వేడుకలో రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ సతీసమేతంగా హాజరయ్యారు. ఆ పర్యటనలోనే హాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు జేమ్స్‌ కామెరూన్‌ను రాజమౌళి, కీరవాణి కలిశారు. వారి సంభాషణా వీడియోను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రేక్షకులతో పంచుకుంది. దాన్ని రీట్వీట్‌ చేసిన రామ్‌గోపాల్‌ వర్మ తనదైన శైలిలో రాజమౌళిపై ప్రశంసలు కురిపించారు.

Read more RELATED
Recommended to you

Latest news