ఇస్మార్ట్ శంకర్‌గా అలరించనున్న రామ్..

-

Ram new movie ismart shankar

ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వస్తున్న మూవీ ఇస్మార్ట్ శంకర్. ఇవాళే వీళ్ల కాంబో సినిమాకు పేరు పెట్టారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే వేసవికి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నది మూవీ యూనిట్.

Ram new movie ismart shankar

డబుల్ సిమ్ కార్డు అనేది సినిమా టాగ్‌లైన్. వరుస ప్లాఫులతో సతమతమవుతున్న పూరి జగన్నాథ్, రామ్.. ఇద్దరికీ ఈ సినిమా చాలెంజింగే. అందుకే.. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఇద్దరూ ఉన్నారు. ఈ సినిమా నిర్మాణం, ఇతర బాధ్యతలన్నీ నటి చార్మీ చూసుకుంటున్నదట. చార్మీ గత కొన్ని రోజులుగా పూరీ బ్యానర్‌లో పని చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో హీరోయిన్, ఇతర పాత్రల్లో నటించే వాళ్ల గురించి ఇంకా వివరాలు తెలియలేదు. కాకపోతే కొత్త నటులు ఈ సినిమాలో నటిస్తున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news