సినిమాలు – యాడ్స్ ద్వారా రామ్ పోతినేని సంపాదన అన్ని కోట్లా..?

-

రామ్ పోతినేని మొదట అడయాలం అనే షార్ట్ ఫిలిం ద్వారా కోలీవుడ్ ఇండస్ట్రీలో కి అడుగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకొని.. ఉత్తమ నటుడిగా అవార్డులను కూడా సొంతం చేసుకున్న ఆయన ఆ తర్వాత తెలుగులో దేవదాసు చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. ఇక ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ సోదరుడి కుమారుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ పోతినేని వరుస విజయాలు అందుకుంటూ తెలుగు సినీ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. మస్కా, కందిరీగ, రెడీ వంటి సినిమాలతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రామ్.. ఒక యాక్టర్ గానే కాకుండా ఈ సినిమాలతో బెస్ట్ డాన్సర్ గా కూడా పేరు సంపాదించుకోవడం గమనార్హం.

కానీ ఆయన సినిమాలకు అటు బాలీవుడ్ లో కూడా మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగులో నటించిన చాలా సినిమాలు బాలీవుడ్ లో సుమారుగా 100 మిలియన్ లకు పైగా వ్యూస్ ను రాబట్టి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇక వాటిలో హలో గురు ప్రేమకోసమే, నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ, ఇస్మార్ట్ శంకర్ , హైపర్ వంటి సినిమాలతో మంచి ఇమేజ్ సొంతం చేసుకుని బాలీవుడ్ లో ఈ ఘనత అందుకున్న టాలీవుడ్ హీరో గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం ది వారియర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు రామ్ పోతినేని.

రూ.20 కోట్ల బడ్జెట్ తో మొదలుపెట్టిన ఈయన సినిమాలు ప్రస్తుతం వందకోట్లకు చేరుకోవడం గమనార్హం. ప్రస్తుతం రామ్ పోతినేని పారితోషకం ఒక్కో సినిమాకు రూ. 20 కోట్లకు పైగా అన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు ఈయన నికర ఆస్తి రూ. 120 కోట్లు అని సమాచారం. ఇక పలు యాడ్స్ ద్వారా ప్రతి సంవత్సరం రూ.5 కోట్లకి పైగా అందుకున్నారట రామ్ పోతినేని.

Read more RELATED
Recommended to you

Latest news