సినిమా కోసం 12 కేజీల బరువు పెరిగిన టాలీవుడ్ హీరో!

-

బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, యంగ్ బ్యూటీ శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం స్కంద. ఈ భారీ పాన్ ఇండియా మూవీ ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించారు. సెప్టెంబర్ 28వ తేదీన అంటే రేపు ఈ చిత్రం గ్రాండ్ గా పలు భాషలలో ఆడియన్స్ ముందుకి రానుంది.

Ram Pothineni Transformation
Ram Pothineni Transformation

అయితే..హీరో రామ్ నటించిన ‘స్కంద’ సినిమా రేపు థియేటర్లలో విడుదల కానుండగా, ఈ మూవీ కోసం రామ్ 12 కేజీల బరువు పెరిగినట్లు సినీ వర్గాలు తెలిపాయి. సినిమాలోని పాత్రకు తగినట్లుగా కనిపించడానికి 72 కేజీల బరువు ఉండే రామ్… 84 కేజీలకు తన బరువును పెంచుకున్నట్లు సమాచారం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news