వై నాట్ 175.. ఇది జగన్ నినాదం..గత ఎన్నికల్లో 175కి 151 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చాం..ఇక అధికారంలో ప్రజలకు అంతా మంచే చేస్తున్నాం.. అలాంటప్పుడు ఈ సారి 175కి 175 సీట్లు ఎందుకు గెలవలేమని జగన్ అంటున్నారు. ఆ దిశగానే ఎమ్మెల్యేలు పనిచేయాలని.. గడపగడపకి ప్రోగ్రాం పెట్టారు. ఆ ప్రోగ్రాం విజయవంతంగా కొనసాగుతుంది. ఇక ఈ ప్రోగ్రాం నవంబర్ తో ఆగిపోనుంది.
అక్కడ నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మొదలవుతుంది. అలాగే ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి అనే ప్రోగ్రాం ఉంటుంది. వైసీపీ నేతలంతా ప్రజల్లో ఉండేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఆరు నెలలు నేతలంతా ప్రజల్లోనే ఉండనున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్తితులు తమకు చాలా అనుకూలంగా ఉన్నాయి. తమని ఎదురుకోలేక ప్రతిపక్షాలు భయపడి పొత్తులకు వెళుతున్నాయని జగన్ చెబుతున్నారు. అలాంటప్పుడు 175 సీట్లు గెలవడం అసాధ్యం కాదని అంటున్నారు. ఇక 175 ఖచ్చితంగా గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.
అదే సమయంలో ఈ సారి కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వడం మాత్రం కుదరదు అని జగన్ చెప్పేశారు. ఎందుకంటే కొందరిపై ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉంది. వారిని జగన్ ఇమేజ్ కూడా కాపాడలేదు. వారికి మళ్ళీ సీటు ఇస్తే ఓటమి ఖాయం.. దాని వల్ల వైసీపీ విజయంపై ప్రభావం చూపుతుంది. అలాంటిది జరగకుండా ఉండాలంటే వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు సీటు ఇవ్వకూడదు.
జగన్ ఇప్పుడు అదే స్ట్రాటజీతో ముందుకెళుతున్నారు. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మాత్రం సీటు ఇవ్వకూడదని, అక్కడ బలమైన అభ్యర్ధులని నిలబెట్టాలని చూస్తున్నారు. అప్పుడే గెలుపు సాధ్యమని భావిస్తున్నారు.