రామ్‌చ‌ర‌ణ్ బాట‌లో ఎన్టీఆర్‌.. మ‌రి లాజిక్ ప‌నిచేస్తుందా!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని త‌న 30వ సినిమాను బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్టర్ కొర‌టాల శివ‌తో తీస్తున్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్ కు ఓ ల్యాండ్ మార్క్‌. చాలా మంది స్టార్ హీరోల‌కంటే ఎన్టీఆర్ త్వ‌ర‌గా 30వ సినిమాకు చేరుకున్నాడు. ఈ సినిమాను ఎలాగైనా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చేసి.. మెమొర‌బుల్ గా మార్చుకోవాల‌నుకంటున్నాడు. అందుకోసం ప‌క్కాగా అడుగులు వేస్తున్నాడు.

ఈ క్ర‌మంలోనే సినిమాపై హైప్ తీసుకొచ్చేందుకు ఓ మాస్ట‌ర్ స్కెచ్ వేశాడు. అందుకోసం రామ్ చ‌ర‌ణ్ ను ఫాలో అవుతున్నాడు. త‌మిళంలో మంచి క్రేజ్ ఉన్న అర‌వింద్ స్వామిని త‌న సినిమాలో విల‌న్‌గా చూపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే కొర‌టాల ఇందుకోసం అర‌వింద్‌కు క‌థ వినిపించాడ‌ని స‌మాచారం.

ఈ సినిమాలో వ్యూహ‌, ప్ర‌తి వ్యూహాలు ప‌న్నే విల‌న్ పాత్ర ఉంటుందంట‌. ఇలాంటి పాత్ర‌లో అర‌వింద్ అయితే బెట‌ర్ అని కొర‌టాల ఫిక్స్ అయ్యాడంట‌. ఎందుకంటే ధృవ సినిమాలో అర‌వింద్ ఎంత సైలెంట్ అండ్ ప‌వ‌ర్ ఫుల్ గా స్కెచ్ లు వేశాడో చూశాం. ఇది కూడా అలాంటి ప‌వ‌ర్‌ఫుల్ రోల్ కావ‌డంతో ఆయ‌నైతే బాగుంటుంద‌ని కొర‌టాల భావించి, ఆయ‌నకు క‌థ చెప్పి ఒప్పించాడ‌ని స‌మాచారం. మ‌రి ఆయ‌న పాత్ర ఎంత ప‌వ‌ర్‌ఫుల్ గా ఉంటుందో చూడాలి.