షాకింగ్‌.. అమెజాన్ అడవుల నుంచి పెద్ద మొత్తంలో కార్బ‌న్ డ‌యాక్సైడ్ విడుద‌ల‌..

-

సాధార‌ణంగా చెట్లు మ‌నం వ‌దిలే కార్బ‌న్ డ‌యాక్సైడ్‌ను పీల్చుకుని ఆక్సిజ‌న్‌ను వ‌దులుతాయి. దీంతో ఆ ఆక్సిజ‌న్‌ను మ‌నం పీల్చుకుని జీవిస్తాం. భూమిపై ఉన్న స‌మ‌స్త జీవ‌కోటికి ఆక్సిజ‌న్ ప్రాణాధారం. అందుక‌నే చెట్ల‌ను పెంచాల‌ని, కొట్టి వేయ‌కూడ‌ద‌ని ప‌ర్యావర‌ణ వేత్త‌లు చెబుతుంటారు. అయితే సైంటిస్టులు చేప‌ట్టిన తాజా అధ్య‌య‌నంలో ఓ షాకింగ్ విష‌యం వెల్ల‌డైంది. అదేమిటంటే…

amazon forests released more carbon dioxide than absorbed

ప్ర‌పంచంలోని అత్యంత పెద్ద‌వైన అడ‌వులుగా అమెజాన్ అడ‌వులు ప్ర‌సిద్ధి గాంచాయి. అక్క‌డ ఎన్నో వృక్ష‌, జీవ జాతులు ఉంటాయి. ప్ర‌పంచానికి అవ‌స‌ర‌మయ్యే ఆక్సిజ‌న్‌లో చాలా వ‌ర‌కు ఆక్సిజ‌న్ అమెజాన్ అడ‌వుల నుంచే వ‌స్తుంది. అయితే గ‌త 10 సంవ‌త్స‌రాల కాలంలో అమెజాన్ అడవులు కార్బ‌న్ డ‌యాక్సైడ్‌ను పీల్చుకునే దాని క‌న్నా ఎక్కువ‌గా విడుద‌ల చేశాయ‌ని ఓ అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది.

సైంటిస్టులు చేప‌ట్టిన ఆ అధ్య‌య‌నం తాలూకు వివ‌రాల‌ను నేచ‌ర్ క్లైమేట్ చేంజ్‌ అనే అధ్య‌య‌నంలో ప్ర‌చురించారు. 2010 నుంచి 2019 వ‌రకు బ్రెజిల్‌లోని అమెజాన్ బేసిన్ నుంచి 16.6 బిలియ‌న్ ట‌న్నుల కార్బ‌న్ డ‌యాక్సైడ్ విడుద‌ల కాగా 13.9 ట‌న్నుల కార్బ‌న్ డ‌యాక్సైడ్‌ను మాత్ర‌మే అడవులు పీల్చుకున్నాయి. అంటే గ్ర‌హించిన కార్బ‌న్ డ‌యాక్సైడ్ క‌న్నా వ‌దిలిన కార్బ‌న్ డ‌యాక్సైడ్ స్థాయిలే ఎక్కువ‌గా ఉన్నాయి. ఇది చాలా ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మ‌ని, వెంట‌నే దీని విష‌యమై ఆ దేశ ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌ర్యావేర‌ణ వేత్త‌లు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news