బాలీవుడ్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ..

-

బాలీవుడ్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రామ్ గోపాల్ వర్మ.దక్షిణాది సినిమాలని ప్రశంసిస్తూ వర్మ ట్వీట్ చేశారు. తన మనసులోని మాటను ఏ మాత్రం సంకోచించకుండా కుండబద్దలుు కొట్టినట్టు చెప్పడం దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నైజం.ఎవరు ఏమనుకుంటారో అనేది ఆయనకు అవసరం లేదు.ఆ తర్వాత తనకు ఎదురయ్యే విమర్శలను కూడా ఆయన అసలు పట్టించుకోరు.తాజాగా బాలీవుడ్ కు మండిపోయే ప్రశ్నను వర్మ సంధించారు.దక్షిణాది సినిమాలు హిందీలో సైతం విడుదల అవుతూ భారీ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మన సినిమాలను ప్రశంసిస్తూ, హిందీ సినిమాలను తక్కువ చేసేలా వర్మ ట్వీట్ చేశారు.బాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ (తొలిరోజు వసూల్లు) సినిమాల జాబితాను వర్మ ట్విట్టర్లో షేర్ చేశారు.హిందీ సినిమా చరిత్రలో కన్నడ డబ్బింగ్ సినిమా” కే జి ఎఫ్ 2, తెలుగు డబ్బింగ్ సినిమా బాహుబలి 2 లు బిగ్గెస్ట్ ఓపెనర్లుగా నిలవడం పై హిందీ పరిశ్రమ( బాలీవుడ్) ఏమి ఆలోచిస్తుందని మీరు అనుకుంటున్నారు?అని ప్రశ్నించారు.ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.నెటిజన్లు దీనిపై విపరీతంగా స్పందిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version