పగిలిన పాదాలకు మిగిలిన గ్రీన్ టీ బ్యాగ్ లు చక్కటి పరిష్కారం

-

బాడీలో అరిచేతులు, అరికాళ్లు చాలా సున్నితంగా ఉంటాయి. చలి ఎక్కువైనా.. వేడి పెరిగినా.. అరికాళ్లే ఎఫెక్ట్ అవుతాయి. అటు చలికాలంలోనూ.. ఇటు ఎండాకాలం లోనూ.. కాళ్లు పగులుతాయి. వీటివల్ల నొప్పి ఉండటమే కాకుండా.. పాదాల అందం కూడా దెబ్బతింటుంది. వీటి కోసం ఇక ఎన్నో క్రీమ్స్ వాడతారు. అయితే.. క్రీమ్ రాసిన అన్ని డేస్ మాత్రమే పగుళ్లు కాస్త తగ్గినట్లు అవుతాయి. ఎప్పుడైతే క్రీమ్ రాయడం ఆపేస్తామో.. మళ్లీ విపరీతంగా పగుళుతాయి. మృతకణాలు పాదాల చుట్టూ దట్టంగా పేరుకుపోయి.. గట్టిగా మారతాయి. ఈ సమస్యకు గ్రీన్ టీ బ్యాగ్స్ ఉపయోగపడతాయి అంటున్నారు సౌందర్య నిపుణులు.
గ్రీన్ టీతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.. చర్మం నిగారింపును మెరుగు పరచటమే కాకుండా వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది. అతి నీలలోహిత కిరణాల నుంచి కాపాడి ముడతలను, మంటను తగ్గిస్తుంది. పాదాలను సంరక్షించడంలోనూ గ్రీన్ టీ కీలక పాత్ర పోషిస్తుందట.. గ్రీన్‌ టీలో కాసేపు పాదాలను ఉంచితే మంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో సమృద్ధిగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పాదాల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తాయి.

గ్రీన్ టీలో ఉండే విటమిన్ ఈ పాదాలకు తేమను అందించటంతోపాటు, ఎండ, చెమట కారణంగా వచ్చే అలర్జీలను దరిచేరకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పాదాల రక్షణకు తోడ్పడతాయి. ఎండాకాలంలో వేడి కారణంగా పాదాలపై చర్మం రంగు మారుతుంటుంది. ట్యాన్ ఎక్కువవుతుంది. అలాంటి వాటిని తొలగించటంలో గ్రీన్ టీలో ఉండే విటమిన్ సి హెల్ప్ అవుతుంది.

పాదాలను గ్రీన్ టీ తో శుభ్రం చేసుకునేందుకు ముందుగా నాలుగు గ్రీన్‌ టీ సంచులను కొన్ని వేడినీళ్లు తీసుకుని అందులో వేయాలి. లేదా.. మీ ఇంట్లో గ్రీన్ టీ తాగే అలవాటు ఉంటే.. అందరూ తాగేశాక. ఆ బ్యాగ్స్ అన్నీ వేడినీళ్లలో వేసి అందులో ఫ్రష్ బ్యాగ్ ఒకటి వేయండి. కాళ్లను సబ్బుతో క్లీన్ చేసుకుని టీ నీళ్లు గోరువెచ్చగా అవగానే బకెట్‌లో కొంచెం మినరల్‌ బాత్‌ సాల్ట్‌ కలపాలి. పాదాలను 15 నిమిషాలపాటు ఆ నీటిలో ఉంచాలి. ఆ తర్వాత ప్యూమిస్‌ స్టోన్‌ తో బాగా రుద్దాలి. ఇలా చేస్తే చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. అనంతరం పాదాలను శుభ్రం చేసుకోవాలి. పాదాలను ఎప్పుడు వేడినీళ్లలో పెట్టినా మాయిశ్చరైజర్‌ను అప్లై చేయడం మాత్రం మర్చిపోకండే. ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లు పోయి.. అందంగా మారతాయి.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Exit mobile version