రాములో… రాముల’  అంటూ సంగీత ప్రియుల‌ను ఉర్రూత‌లూగిస్తున్న బ‌న్నీ

-

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాటల మాంత్రికుడు, సుప్రసిద్ధ సినీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అల వైకుంఠపురములో…’ వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన భారీ నిర్మాణ సంస్థలు ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల అవుతోందని చిత్ర బృందం ప్రకటించింది. ఇటీవల విడుదల చేసిన ‘సామజవరగమన’ పాట ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.

తెలుగులో ఒక పాటకు  800K కు పైగా లైక్స్ రావడం ఇదే ప్రధమం. థమన్ తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేసాడనే చెప్పాలి. ఇక ఇప్పుడు థమన్ స్వరపరచిన ‘రాములో రాముల’ అనే పాట విడుదలైంది. విడుదలైన కొద్దీ సేపటికే సంగీత ప్రియులను ఉర్రూతలూగిస్తున్నవైనం ఈ గీతం సొంతం. ఈ మధ్య వరుసగా మాస్ సాంగ్స్ రాస్తూ సూపర్ ఫామ్ లో ఉన్న కాసర్ల శ్యామ్ ఈ పాట రాసారు. ఈ మాస్ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి, మంగ్లీ అద్భుతంగా పాడారు. ఈ పాటకు శేఖర్ మాష్టర్ నృత్య రీతులు సమకూర్చారు.ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2020 జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version