రమ్యకృష్ణ బర్త్​డే.. రిపబ్లిక్​ మూవీ నుంచి విశాఖ వాణి లుక్​

రమ్యకృష్ణ.. ఎవర్​గ్రీన్​, బ్యూటీఫుల్, సూపర్​… ఇలా ఎన్ని పదాలు వాడిన.. ఆమె గురించి తక్కువ చెప్పినట్లే అవుతోంది. కేవలం అందం మాత్రమే కాదు నటన విషయంలో కూడా ఆమెకు ఆమే సాటి.. నటి రమ్యకృష్ణ బర్త్​డే 41 వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఆమె బర్తడే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అంతేగాక శివగామి పుట్టిన రోజున ఆమె ఫ్యాన్స్​కు సర్​స్పైజ్ ఇచ్చారు. రిపబ్లిక్ మూవీ టీం.. కాగా రమ్యకృష్ణ సాయి ధరమ్​ తేజ్ రిపబ్లిక్ మూవీలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే ఇందులోను అమె విశాఖ వాణిగా పాత్ర పోషిస్తున్నారు. ఇందుకు సంబంధించిన లుక్​ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్​లో రమ్యకృష్ణ సీరియస్​గా పవర్​ ఫుల్​ మహిళ రాజకీయ నాయకురాలిగా కనిపించారు. కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్ 1న విడుదల కానుంది.