వైరల్ గా మారిన రమ్యకృష్ణ ఆస్తులు.. ఎన్ని కోట్లు అంటే..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదట్లో ఐరన్ లెగ్ అనిపించుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత వరుస సినిమాలతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె ఆ కాలంలో అందరి స్టార్ హీరోల సరసన నటించి మరింత క్రేజ్ దక్కించుకుంది. ఇకపోతే ఒకవైపు హీరోయిన్ గా నటిస్తూనే మరొకవైపు లేడీ విలన్ గా కూడా అదరగొట్టేసిందనే చెప్పాలి. అలా తన నటనతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకున్న ఈమె ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 30 సంవత్సరాలు అవుతున్నా ఇంకా అదే హోదాలో కొనసాగుతోంది అంటే రమ్యకృష్ణ నటనకు ప్రేక్షకులు ఎంతలా ఫిదా అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి అన్నీ కూడా క్యారెక్టర్ బేస్డ్ పాత్రలలో నటిస్తూ మరింత క్రేజీ దక్కించుకుని అలా బాహుబలి సినిమాలో శివగామిగా రాజసం ఉట్టిపడే పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత జైలర్ సినిమాలో కూడా కీలకపాత్ర పోషించింది. రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో కీ రోల్ పోషించిన ఈమె ఈ సినిమా కోసం భారీగానే రెమ్యూనరేషన్ తీసుకుందని సమాచారం. ఇకపోతే ఈ సినిమా ఏకంగా రూ.600 కోట్ల కలెక్షన్స్ వసూలు చేయగా.. ఈ సినిమాకి గాను హీరో రజనీకాంత్ కు సుమారుగా 210 కోట్ల రూపాయలను అప్పజెప్పారు.

ఇదిలా ఉండగా తాజాగా రమ్యకృష్ణ ఆస్తులు మరొకసారి వైరల్ గా మారుతున్నాయి. ఇండస్ట్రీకి వచ్చి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇలాంటి విషయాలు వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ఇదిలా ఉండగా 30 ఏళ్ల తన సినీ కెరియర్లో రమ్యకృష్ణ ఏనాడూ కూడా పారితోషకం విషయంలో నిర్మాతలను ఇబ్బంది పెట్టలేదు. అందుకే ఆమె కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఆస్తులు కూడబెట్టిందని సమాచారం. ఏది ఏమైనా రమ్యకృష్ణ ఆస్తులు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news