టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కలిసి నటించిన సినిమా ఖుషి. గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ ఇద్దరికి ఖుషి చిత్రం కాస్త ఊరటనిచ్చిందని చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 1వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సంపాదించుకుంది. మరోవైపు మొదటి రోజు కలెక్షన్లు కూడా చెప్పుకోదగ్గ రీతిలోనే వచ్చాయని ట్రేడ్ వర్గాల టాక్.
ఖుషి మూవీకి నైజాంలో రూ. 15 కోట్లు, సీడెడ్‌లో రూ. 6 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 20 కోట్లు.. మొత్తంగా రూ.41 కోట్ల వరకు బిజినెస్ జరిగిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 4.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 7 కోట్లతో కలిపి.. వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రూ. 52.50 కోట్లు బిజినెస్ చేసిందట.ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 9.50 నుంచి రూ.10.00 కోట్లు షేర్ వసూలు వచ్చినట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 13.20 నుంచి రూ.13.50 కోట్ల వరకు షేర్ అందుకుందట.