రానా దగ్గుబాటి ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నాడు. శాండియాగోలో జరుగుతున్న కామిక్ కాన్‌లో పాల్గొనేందుకు ప్రభాస్‌కి తోడుగా రానా వెళ్లాడు. ‘ప్రాజెక్ట్ కె’ టీజర్ విడుదల కార్యక్రమంలో ఇద్దరూ కలిసి సందడి చేయనున్నారు. ఇదే వేదికపై రానా తన కొత్త చిత్రాల్ని, ఇతర ప్రాజెక్టుల్ని కూడా ప్రకటించాడు. అంతర్జాతీయ స్థాయిలో ‘హిరణ్యకశ్యప’ చిత్రం చేసేందుకు రానా ఎప్పట్నుంచో ట్రై చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ సినిమాని కామిక్ కాన్ వేదికపై ప్రకటించాడు.
తన సొంత నిర్మాణ సంస్థ స్పిరిట్ మీడియా పతాకంపై హిరణ్యకశ్యప రూపొందనుంది. అమర చిత్ర కథల ఆధారంగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాకు కథ అందించనున్నాడు. అయితే దీనికి దర్శకుడు ఎవరన్నది మాత్రం ఇంకా తెలియలేదు.
‘లార్డ్ ఆఫ్ ది డెక్కన్’ పేరుతో సోనీ లివ్‌తో కలిసి నిర్మించనున్న సిరీస్‌ని కూడా రానా ఈ వేదికపై ప్రకటించాడు. చాళుక్యుల రాజవంశం నేపథ్యంలో ఈ సిరీస్ తెరకెక్కనున్నట్లు తెలిపాడు. వీకెండ్ బ్లాక్‌బస్టర్ సంస్థతో కలిసి హీరో టొవినో థామస్ నటించిన మలయాళ చిత్రం మిన్నల్ మురళి మూవీని కామిక్ రూపంలో ‘టింకిల్’ పేరుతో నిర్మించనున్నట్లు చెప్పాడు.