రానా పెళ్లి చేసుకోబోయే అమ్మాయి.. ఈ అమ్మాయే..!

-

టాలీవుడ్ టాల్ హీరో రానా దగ్గుబాటి అభిమానులకు, ప్రేక్షకులకు సీట్ స్ర్ప్రైజ్ ఇచ్చారు. డాక్టర్ డి రామానాయుడు మనవడు స్టార్ ప్రొడ్యూసర్ డి.సురేష్ బాబు తనయుడు రానా.. తను పెళ్ళి చేసుకోబోయో అమ్మాయిని పరిచయం చేశాడు. గత కొంతకాలంగా ఇద్దరు రిలేషన్ లో ఉన్నారట. అయితే ఇప్పటి వరకు ప్రేమ గురించి ఒకరి కోకరు బయటపడలేదట. ఎటకేలకి ఈ విషయం లో రానా చొరవ తీసుకొని తన ప్రేమను తెలుపగా ఆమే ఓకే చెప్పింది అంటూ మిహికా బజాజ్ తో దిగిన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి గుడ్ న్యూస్ చెప్పాడు.

 

హైదరాబాద్ కు చెందిన మీహికా బజాజ్…ప్రస్తుతం “డ్యూ డ్రాప్ స్టూడియో” అనే ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ నడుపుతుంది. మిహీకా బజాజ్ స్వస్థలం హైదరాబాద్. అయితే
పదేళ్ల కిందటే ముంబయిలో స్థిరపడ్డారు. మిహీకా బజాజ్ముంబయిలో డ్యూ డ్రాప్ డిజైనింగ్ స్టూడియో నడుపుతున్నారు. ఎట్టకేలకు శుభ వార్త వినిపించిన రానాదగ్గుబాటి కి పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇక ప్రస్తుతం రానా బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ సినిమా హాథి మేరే సాథి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తెలుగులో అరణ్య పేరుతో రిలీజ్ కానుంది. అలాగే సాయి పల్లవి, ప్రియమణి హీరోయిన్స్ గా విరాట పర్వం సినిమా ప్రస్తుతం షూటి గ్ దశలో ఉంది. అలాగే క్రియోటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో హిస్టారికల్ మూవీ హిరణ్య కశిప లోను నటిస్తున్నాడు. ఈ సినిమాని సురేష్ బాబు, గుణశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version