రానా నిర్మిస్తున్న కేరాఫ్ కంచరపాలెం టీజర్

-

న్యూ ఏజ్ గ్రూప్ ఆఫ్ టాలెంటెడ్ క్రియేటర్స్ ఎంట్రీ ఇస్తున్న తరుణంలో టాలీవుడ్ కు ఓ కొత్త కళ వచ్చిందని చెప్పాలి. ఒకప్పుడు సినిమా అంటే ఇలానే ఉండాలి అన్న రూల్ ను పూర్తిగా మార్చేసి ప్రేక్షకుల మెప్పు పొందేలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాలో కంటెంట్ వాల్యుబుల్ గా ఉంది అంటే ఆ సినిమా చిన్నదా పెద్దదా అని కూడా చూడకుండా హిట్ చేసేస్తున్నారు.

ఇక ఈ క్రమంలో కొత్తగా వచ్చే వారు డిఫరెంట్ స్టైల్ లో తమ ప్రతిభ కనబరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే వస్తున్న సినిమా కేరాఫ్ కంచరపాలెం. దగ్గుబాటి రానా సమర్పణలో వస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ చూస్తే కచ్చితంగా ఇదో కల్ట్ మూవీ అనిపిస్తుంది. సినిమాలో ఉన్న నటీనటులంతా పాత్రల్లో జీవించేశారు.

టీజర్ మాత్రం ఒక్కసారి అందరిని సర్ ప్రైజ్ అయ్యేలా చేసింది. మరి ఈ కేరాఫ్ కంచరపాలెం ఎలాంటి అనుభూతిని కలిగిస్తుందో చూడాలి. కొన్నాళ్లుగా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు తెచ్చే ఆలోచనలో ఉన్నారు. మహా వెంకటేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రవీణ పరుచూరి నిర్మిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news