బాలీవుడ్ స్టార్ కపుల్ రన్వీర్ సింగ్ దీపికా పదుకొనే పెళ్లినాటి నుంచి ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ వస్తున్నారు. అలాగే మీడియా ముందు సైతం వీరిద్దరూ జంటగా కనిపించి వావ్ అనిపిస్తారు. బీటౌన్ జంటలలో చాలా డిఫరెంట్‌గా కూడా కనిపిస్తుంటారు. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌లో ఒకరి పట్ల మరొకరు ఎంతో గౌరవంగా ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా ఉంటారు. అయితే తాజాగా ఓ పబ్లిక్ ఈవెంట్ కు హాజరైన దీపిక రన్వీర్ సింగ్ మధ్య జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది.
తాజాగా ఓ బడా ఈవెంట్ కు హాజరయ్యారు దీపికా పదుకొనే రన్వీర్ సింగ్. అయితే ఈవెంట్లో రన్వీర్ పక్కనే ఉండి చేయి అందిస్తున్న పట్టించుకోకుండా దీపిక ముందుకు వెళ్ళిపోయారు. ఈ విషయం అక్కడే ఉన్న మీడియా కంట పడటంతో ప్రస్తుతం వైరల్ గా మారింది. వీరిద్దరి మధ్య ఏం జరిగింది అంటూ పలు రకాలుగా మార్పులు వినిపిస్తున్నాయి..
కాగా ఈ గ్రాండ్ ఈవెంట్లో హీరోయిన్ దీపికా పదుకొణె చేయి పట్టుకుని నడిచేందుకు రణవీర్ సింగ్ ఆసక్తి చూపించారు. ముందుగా కారు దిగిన ఆయన.. రెడ్ కార్పెట్‌పై నడిచేందుకు దీపిక కోసం ఎదురు చూశారు. దీపిక కారు దిగగానే తన చేయి చాచారు. కానీ దాన్ని చూడనట్టుగానే దీపిక పదుకొణె ముందుకు అడుగులు వేస్తూ నడిచింది. దీంతో రణ్వీర్ సింగ్ తన చేయిని కిందకు దించేసి ముందుకు సాగిపోయారు. అనంతరం మళ్లీ అతన్ని దాటుకుంటూ దీపిక వెళ్లిపోయారే తప్ప ఏమాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా ఏం జరిగింది అంటూ పలు రకాల వాదనలు మాత్రం వినిపిస్తూ వస్తున్నాయి.
View this post on Instagram