సిక్రెట్ మ్యారేజ్ పుకార్లపై స్పందించిన ర‌కుల్ ప్రీత్

-

గ‌త కొద్ది రోజుల నుంచి హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ వివాహం జ‌రిగింద‌నే వార్త‌లు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. అత్యంత ర‌హస్యంగా ర‌కుల్ ప్రీత్ సింగ్ వివాహం జ‌రిగింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ వార్త‌ల‌పై హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ తాజాగా స్పందించింది. త‌న జీవితానికి సంబంధించిన ముఖ్య‌మైన విష‌యాల‌ను తానే పంచుకుంటాన‌ని తెలిపింది. త‌న వ్య‌క్తి గ‌త జీవితంపై ఎవ‌రూ కూడా అస‌త్యాల‌ను, పుకార్ల‌ను ప్ర‌చారం చేయ‌వ‌ద్ద‌ని అన్నారు.

అలాగే త‌న చేతిలో దాదాపు 10కి పైగా సినిమాలు ఉన్నాయ‌ని అన్నారు. ప్ర‌స్తుతం త‌న దృష్టి సినిమాల‌పైనే ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి స‌మ‌యంలో త‌న గురించే వ‌చ్చే పుకార్ల ను పట్టించుకోన‌ని తెలిపింది. త‌న గురించే ఎలాంటి విష‌యం ఉన్నా తానే మొద‌ట‌గా చెబుతాన‌ని తెలిపింది. అయితే ర‌కుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ ప్రొడ్యూస‌ర్, న‌టుడు జాకీ భ‌గ్నానీతో ప్రేమ‌లో ఉంది. ఈ విష‌యాన్ని ర‌కుల్ ప్రీత్ సింగ్ గ‌తంలోనే అధికారికంగా తెలిపింది. అయితే వీరికి వివాహం జ‌రిగింద‌నే వార్తలు ఈ మ‌ధ్య కాలంలో వ‌చ్చాయి. ఈ వార్త‌ల‌ను ర‌కుల్ ప్రీత్ సింగ్ ఖండించారు.

Read more RELATED
Recommended to you

Latest news