జీవితంలో ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొన్నాను… ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సినీ నటి సమంత

-

నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తరువాత సమంత ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతోంది. తాజాగా ఓ కార్యక్రయంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జీవితం ఎవరికి అద్భుతంగా ఉండదని… తన జీవితంలో కూడా ఎన్నొో రకాల మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు సినీ నటి సమంత చెప్పారు. మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, వైద్యుల సాయం తీసుకోవాలని సూచించారు. మానసికి సమస్యలు వచ్చినప్పుడు నేను ధైర్యంగా నిలబడేందుకు ఎందరో సహాయం చేశారని సమంత అన్నారు. నా స్నేహితులు, కుటుంబం, కౌన్సిలర్లు ఎంతో ధైర్యాన్ని అందించారని వెల్లడించింది. ఇటీవల రోష్ని ట్రస్ట్‌ ‘సైకియాట్రి ఎట్‌ డోర్‌ స్టెప్‌’ కార్యక్రమాన్ని ప్రారంభ కార్యక్రమంలో సమంత ఈ వ్యాఖ్యలు చేసింది.

నాగచైతన్యతో విడిపోయిన తర్వాత చాలా రోజుల వరకు ఆ బాధ నుంచి బయటపడలేదు. సమంత ఒకానొక సమయంలో చనిపోవాలన్నా ఆలోచనలు కూడా వచ్చాయని వెల్లడించింది. చాలా సార్ల ఎమోషనల్ పోస్టులను కూడా పెట్టింది. అయితే ఇటీవల ఈ ఇష్యూ నుంచి బయటపడిని సమంత వరస పెట్టి సినిమాలు చేస్తోంది. ఇటీవల పుష్ఫ సినిమాలో ‘‘ ఊ అంటావా మావా.. ఊఊ అంటావా’’ పాట పెద్ద హిట్ అయింది. దీంతో పాటు గుణ శేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా చేస్తోంది. మరోవైపు తెలుగు, తమిళ భాషల్లో యశోద సినిమా చేస్తోంది. మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ కూడా లైన్ లో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news