తెలంగాణ కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. టాలీవుడ్ హీరోలతో పాటు… రాజకీయ నాయకులు ఈ కరోనా భారీన పడుతున్నారు. ఇక తాజాగా టీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. తానకు రెండు రోజుల నుంచి జలుబు, కాస్త జ్వరం ఉందని.. దీంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని వివరించారు.
అయితే.. ఈ పరీక్షల్లో తనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని వెల్లడించారు మహేందర్ రెడ్డి. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నట్లు చెప్పారు. ఇక తనను ఈ మధ్య కాలంలో కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఙప్తి చేశారు పట్నం మహేందర్ రెడ్డి. కాగా.. ఇప్పటికే టీఆర్‌ఎస్ ఎంపీలు కే కేశవరావు, జితేందర్ రెడ్డి లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం వారు కూడా హోం ఐసోలేషన్ లో చికిత్స తీసుకున్నారు. ఇటు తెలంగాణ కరోనా కేసులు రోజుకు 2500లకు పైగా నమోదు అవుతున్నాయి.