పాపం రాశి ఖన్నా.. ఇప్పుడు బాధపడుతుంది

-

ఒక సినిమా కథ తమ దగ్గరకు వచ్చినప్పుడు కాదని చెప్పి అదే సినిమా మరో హీరోనో.. హీరోయినో చేసి హిట్ కొడితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసిందే. ఇలాంటి సందర్భాలు ఎక్కువగా హీరోలకే ఎక్కువ వస్తాయి కాని లేటెస్ట్ గా ఇలాంటి సందర్భమే హీరోయిన్ రాశి ఖన్నాకు వచ్చింది. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ లో ఇటీవలే రిలీజ్ అయ్యి సూపర్ హిట్ కొట్టిన గీతా గోవిందం ఆఫర్ ముందు రాశి ఖన్నాకే వచ్చిందట. కాని ఆమె సినిమాను వద్దనుకుంది.

అదే స్థానంలో కోటి రెమ్యునరేషన్ వస్తుందని నితిన్ తో శ్రీనివాస కళ్యాణం సినిమాలో నటించింది. రెండు సినిమాలు వారం గ్యాప్ రో రిలీజ్ అవగా ఒకటి హిట్ మరోటి ఫ్లాప్ అయ్యాయి. నితిన్ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాశి ఖన్నా గీతా గోవిందం సినిమా మిస్ చేసుకున్నందుకు బాధపడుతుందట.

ఇక పరశురాం డైరక్షన్ లో వచ్చిన గీతా గోవిందం మాత్రం రేసుగుర్రంగా దూసుకెళ్తుంది. సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక ఛలో తర్వాత మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం విజయ్, రష్మిక కలిసి డియర్ కామ్రెడ్ సినిమాలో నటిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news