వెబ్ సిరీస్ బాట పట్టిన రాశి ఖన్నా …!?

-

హలు గుసగుసలాడే’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయింది గ్లామరస్ హీరోయిన్ రాశీ ఖన్నా. మొదటి సినిమాలోనే అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఆమె.. వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే టాలీవుడ్‌లోని దాదాపు అందరు హీరోలతో కలిసి నటించింది. నటనకు నటన, గ్లామర్‌కు గ్లామర్ ప్రదర్శిస్తూ సత్తా చాటుతోంది. ఈ మధ్య వరుస విజయాలతో దూసుకుపోతోన్న ఆమె.. ‘వరల్డ్ ఫేమస్ లవ్’ వంటి ఫ్లాప్ తర్వాత మరో సినిమాను ఓకే చేయలేదు.

ఈ నేపథ్యంలో రాశీ ఖన్నా ఓ కీలక నిర్ణయం తీసుకుందని టాక్.దాదాపు ఆరేళ్లుగా తెలుగు సినీ పరిశ్రమ లో హీరోయిన్‌గా కొనసాగుతోంది. అగ్ర హీరోల సరసన నటించే అవకాశం రాకపోయిన ఒక స్థాయిలో తనదైన పాత్రలతో అందరిని ఆకట్టుకుంటోంది. కానీ టాలీవుడ్‌లో అవకాశాలు ఎంత తక్కువ ఉన్నా, తమిళంలో మాత్రం మంచి జోష్‌ను కొనసాగిస్తోంది. వరుస సినిమాలతో తమిళంలో చక్రం తిప్పుతోంది. కొంత కాలంగా ఇండియాలో ఓటీటీ సంస్థల హవా కనిపిస్తోంది. లాక్‌డౌన్ కారణంగా వాటి ప్రభావం ఎక్కువైంది. దీంతో ప్రముఖ సంస్థలన్నీ వెబ్ సిరీస్‌లతో ముందుకొస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు అక్కినేని సమంత, తమన్నా వంటి వారు ఇప్పటికే పలు సిరీస్‌లలో నటించారు. అయితే..తాజాగా ఈ భామ మరో నిర్ణయం తీసుకుంది. రాశీఖన్నా వెబ్‌సిరీస్‌ల బాట పట్టింది. తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు, డీకే కృష్ణ. ద ఫ్యామిలీ మ్యాన్ 2 ను కూడా రూపొందించారు. వీటితో పాటు ఎన్నో వెబ్ సిరీస్‌లను చేశారు. ఇందులో హీరోగా షాహిద్‌ కపూర్‌ నటిస్తున్నాడు . ఈ క్రమంలోనే ప్రస్తుతం వీళ్లు యాక్షన్ జోనర్‌లో ఓ వెబ్ సిరీస్‌ను రూపొందించబోతున్నారట. అమెజాన్ ప్రైమ్ వీడియో దీన్ని నిర్మించనుందనే టాక్ వినిపిస్తోంది. యాక్షన్‌ కథాంశంతో తెరకెక్కే ఈ ప్రాజెక్ట్‌ చిత్రీకరణ జనవరిలో మొదలు పెట్టనున్నారు. తమిళ స్టార్‌ విజయ్‌ సేతుపతితో పాటు పలువురు దక్షిణాది నటులు ఇందులో నటిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version